Ganapati Idol : రెండో శతాబ్దం నాటి గణపతి విగ్రహం..

ఏపీలో రెండో శతాబ్దం నాటి గణపతి విగ్రహం లభ్యమైంది. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో శాతవాహనుల కాలం నాటి విఘ్నేశ్వరుడి ప్రతిమ బయటపడింది.

A second century Ganapati idol found : ఏపీలో రెండో శతాబ్దం నాటి గణపతి విగ్రహం లభ్యమైంది. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో శాతవాహనుల కాలం నాటి విఘ్నేశ్వరుడి ప్రతిమ బయటపడింది. కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ, అమరావతి సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి పోతుగుండుదిన్నె వద్ద వ్యవసాయ భూముల్లో గురువారం విస్తృత అన్వేషణ చేశారు.

ఇందులో 6గీ3గీ1.5 సెంటీమీటర్ల కొలతలు ఉన్న వినాయకుడి మట్టి విగ్రహం వెలుగులోకి వచ్చింది. ఎరుపు, నలుపు మట్టిపాత్రల శకలాలతో ఈ విగ్రహం కనిపించింది. పెద్ద పొట్ట, ఎడమవైపునకు తిరిగిన తొండం, ఏనుగు ముఖం, పగిలిన కాళ్లు, చేతులు, చెవుల ఛాయలు విగ్రహంలో కనిపించాయి.

విగ్రహం శిల్పకళను పరిశీలించిన శివనాగిరెడ్డి ఇది క్రీ.శ రెండో శతాబ్దానికి చెందిన చెందినదిగా గుర్తించారు.ఈ విగ్రహాన్ని గ్రామంలోని ఆలయం వద్ద ఏర్పాటు చేసే ప్రదర్శన శాలలో పొందుపరుస్తామని మాజీ మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు