Chandrababu Arrest : చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా, రేపు ఏం జరగనుంది?

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని దూబే అన్నారు. అప్పటి ఆర్థికశాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారని చెప్పారు. Chandrababu Arrest

Chandrababu Arrest (Photo : Google)

Chandrababu Arrest – ACB Court : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి(అక్టోబర్ 5) వాయిదా పడింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏసీబీ కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. కేసు దర్యాఫ్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేయాలన్నారు. ఈ కేసులో చంద్రబాబుకి 17-ఏ వర్తించదన్నారు.

Also Read..Atchannaidu: ఈ తేదీలోపు చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారు: అచ్చెన్నాయుడు

అంతకుముందు చంద్రబాబు బెయిల్ పై ఆయన తరపు న్యాయవాది ప్రమోద్ దూబే వాదించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని దూబే అన్నారు. అప్పటి ఆర్థికశాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారని చెప్పారు. అధ్యయనం తర్వాత సీమెన్స్ ప్రాజెక్ట్ కు ఎలాంటి అభ్యంతరం తెలపలేదన్నారు. కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఎక్విప్ మెంట్ ధరను నిర్ధారించింది అన్నారు. అయితే, ఈ కమిటీలో చంద్రబాబు లేరన్నారు.

Also Read..Pawan Kalyan: తనకు అందిన నోటీసులపై పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్