ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ACB సోదాలు.. 15 ఏళ్ల తర్వాత రైడ్.. కీలక పత్రాలు స్వాధీనం

తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మెండు లోకనాథంపై అవినీతి నిరోధక శాఖ (ACB Raids) అధికారులు దాడులు చేశారు.

ACB raids on tirumala ttd deputy eo mendu lokanatham

  • తిరుమల డిప్యూటీ ఈవోపై సోదాలు
  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
  • ఐదు చోట్ల ఏసీబీ తనిఖీలు

ACB Raids: తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మెండు లోకనాథంపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదుకావడంతో, అవినీతి నిరోధక శాఖ (ACB Raids) అధికారులు ఆయన ఇల్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచే ఏకకాలంలో ఐదు చోట్ల విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒక టీటీడీ ఉన్నతాధికారి నివాసంలో ఏసీబీ దాడులు జరగడం ప్రస్తుతం ఐటీ కారిడార్, తిరుపతి వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Gold Silver Price Today: బంగారం కొనేవారికి భారీ ఊరట.. తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

ఐదు చోట్ల ఏకకాలంలో తనిఖీలు:

తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్‌లో ఉన్న లోకనాథం నివాసంతో పాటు ఆయన ఇద్దరు బావమరుదుల ఇళ్లలోనూ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. అలాగే ఏర్పేడు మండలం చెల్లూరులోని ఆయన సోదరుడి నివాసంలో, తిరుమలలోని ఆయన డిప్యూటీ ఈవో కార్యాలయంలో ఏసీబీ బృందాలు రికార్డులను జల్లెడ పడుతున్నాయి. ఆయన ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను సీజ్ చేసినట్లు సమాచారం.

శ్రీవారి విధుల్లో ఉండగానే సోదాలు:

ఏసీబీ దాడులు జరిగే సమయంలో లోకనాథం తిరుమల శ్రీవారి ఆలయంలో విధుల్లో ఉండటం విశేషం. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ఏసీబీ అధికారులు తిరుమల క్వార్టర్స్ ముందు వేచి ఉన్నారు. గతంలో 2011లో అప్పటి డిప్యూటీ ఈవో భూపతి రెడ్డిపై ఏసీబీ రైడ్స్ జరగ్గా, మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత లోకనాథంపైనే ఈ స్థాయిలో చర్యలు చేపట్టారు. సోదాలు పూర్తయిన తర్వాత స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, ఆస్తుల లెక్కింపుపై అధికారిక ప్రకటన వెలువడనుంది.