Nara Rohit
Nara Rohit: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు, సినీ నటుడు నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు మరణించిన విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా స్వగ్రామం నారావారి పల్లెకు తీసుకెళ్లారు. ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Also Read: Nara Ramamurthy Naidu : సీఎం చంద్రబాబు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి మృతి..
తండ్రి మృతితో దుఖ: సాగరంలో మునిగిపోయిన నారా రోహిత్ ను ఆయన పెద్దనాన్న సీఎం చంద్రబాబు నాయుడు, సోదరుడు మంత్రి నారా లోకేశ్, ఇతర కటుంబ సభ్యులు ఓదార్చారు. కాగా.. తండ్రి గురించి నారా రోహిత్ తన ‘ఎక్స్’ ఖాతాలో భావోద్వేగ పోస్టు పెట్టారు. ‘మీరొక ఫైటర్ నాన్నా.. మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. నాన్నా.. మాకు ప్రేమించడం, జీవితాన్ని గెలవడం నేర్పించారు. మంచికోసం పోరాడాలని చెప్పారు. మీ జీవితంలో ఎన్నో కష్టాలున్నా అవి మా దరి చేరకుండా పెంచారు. నాన్నా.. మీతో జీవితాంతం మరిచిపోలేని ఎన్నో జ్ఞాపకాలు మాకున్నాయి. నాకు ఏం చెప్పాలో తోచడం లేదు.. బై నాన్నా’ అంటూ నారా రోహిత్ పేర్కొన్నారు.
Bye Nana…! pic.twitter.com/3lbYzXFwNo
— Rohith Nara (@IamRohithNara) November 17, 2024