Adoption row: కేరళ పోలీసుల ఆధీనంలో ప్రకాశం జిల్లా దంపతుల దత్తపుత్రుడు

తన కొడుకును చట్టవ్యతిరేకంగా దత్తత తీసుకున్నారంటూ అనుపమ చేసిన ఆందోళనకు స్పందించారు పోలీసులు. కేరళ సీఎం ఆఫీసు ఎదుట కొన్ని రోజులుగా చేస్తున్న నిరసనపై స్పందించి అధికారులకు ఆదేశాలు...

Kerala Anupama

Adoption row: తన కొడుకును చట్టవ్యతిరేకంగా దత్తత తీసుకున్నారంటూ అనుపమ చేసిన ఆందోళనకు స్పందించారు పోలీసులు. కేరళ సీఎం ఆఫీసు ఎదుట కొన్ని రోజులుగా చేస్తున్న నిరసనపై స్పందించి అధికారులకు ఆదేశాలు అందాయి. కేరళ కోర్టు బాలుడ్ని ప్రకాశం జిల్లాలో ఒంగోలులో పేరూర్ పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు.

బయాలజికల్‌ పేరెంట్స్‌ ఉండటంతో దత్తత తీసుకున్న బాలుడ్ని ఐసిడియస్‌ అధికారుల సమక్షంలో కేరళ పోలీసులకు అప్పగించారు. అక్కడే ఉంచి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. అప్పటి వరకూ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పై బాలుడ్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది.

తనకు తెలియకుండా బాలుడ్ని బాలసదన్‌లో తండ్రి విడిచిపెట్టేశాడని ఆరోపించారు అనుపమ. త్రివేండ్రమ్‌లో కేసు పెట్టిన బాలుడ్ని తన దగ్గరకు చేర్చాలని కోరారు.

డీఎన్ఏ రిపోర్టులో బిడ్డ.. అనుపమ సంతానమే అని తెలిస్తే దత్తత ప్రక్రియను క్యాన్సిల్ చేస్తారు.

………………………………: రంగారెడ్డి జిల్లాలో నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్, హత్య