Tirumala Devotees : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. రెండేళ్ల తర్వాత ఇదే..

తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవేంకటేశ్వర స్వామిని శనివారం రికార్డు స్థాయిలో 75వేల 775 మంది భక్తులు దర్శించుకున్నారు.

Tirumala Devotees Ok

Tirumala Devotees : హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం, కలియుగ దైవం కొలువుదీరిన తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవేంకటేశ్వర స్వామిని శనివారం రికార్డు స్థాయిలో 75వేల 775 మంది భక్తులు దర్శించుకున్నారు. రెండేళ్ల తర్వాత అంటే 2020 మార్చి 17వ తేదీ తర్వాత ఈ స్థాయిలో ఇంతమంది భక్తులు దర్శించుకోవడం ఇదే తొలిసారి. టీటీడీ దర్శన టోకెన్లు పెంచడం, సెలవురోజు కావడంతో ఆదివారం కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. అలిపిరి వద్ద శనివారం మధ్యాహ్నానికే 6వేల వాహనాల తనిఖీ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ పెరగడంతో తిరుమల కొండపై గదుల కొరత పెరిగింది.

Dharmashastra : పురుషుడు ఎలా ఉండాలో… దర్మశాస్త్రం ఏంచెప్పింది?

కోవిడ్‌ ప్రభావం తగ్గిన క్రమంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తిరుమలకు వస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి మొదలైన భక్తుల రద్దీ ఆదివారం కూడా కొనసాగింది. శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు అన్ని ప్రదేశాలు భక్తులతో కిటకిటలాడాయి. అలిపిరి చెక్‌పాయింట్‌లో ఎన్నడూ లేని విధంగా వాహనాలు క్యూలైన్లలో బారులుతీరాయి. చెక్‌పాయింట్‌ నుంచి గరుడ సర్కిల్‌ వరకు వాహనాలు నిలిచాయి.

Tirumala : తిరుమలలో 5 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

కరోనా ప్రారంభం కాకముందు ప్రత్యేక పర్వదినాల్లో మాత్రమే కనిపించే వాహనాల రద్దీ.. ఆదివారం తిరుపతిలోని అలిపిరి వాహనాల తనిఖీ కేంద్రం దగ్గర కనిపించింది. తిరుమల తిరుపతి దేవస్థానం.. శ్రీవారి దర్శనం టోకెన్ల సంఖ్య పెంచడం, కరోనా ఉధృతి తగ్గడంతో తిరుమలకు వచ్చే యాత్రీకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో వేలాది మంది భక్తులు వాహనాల్లో తరలివస్తున్నారు.

ప్రత్యేక పర్వదినాల్లో మాత్రమే కనిపించే ఇంతటి రద్దీ కరోనా తర్వాత ఒక్కసారిగా చూడటంతో అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో వచ్చే భక్తుల కంటే సొంత వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అదనపు సిబ్బంది ద్వారా వాహనాలను తనిఖీ చేస్తున్నారు.