Tirumala : తిరుమలలో 5 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

తిరుమలలో మార్చి 13 నుంచి ప్రారంభమై ఐదు రోజులపాటు జరుగనున్నాయి.రాత్రి 7 నుంచి 8 గంటల వరకు తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు.భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవటానికి ఎదురు చూస్తున్నారు

Tirumala : తిరుమలలో 5 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

Srivari Salakatla Theppotsavalu In Thirumala

Srivari salakatla theppotsavalu in thirumala : తిరుమల. ఈ పేరు చెబితేనే భక్తుల గుండెల్లో గోవిందా గోవిందా అని ప్రతిధ్వనిస్తుంది. అలకారం ప్రియుడైన శ్రీవారు ఎన్నో రూపాలుగా..మరెన్నో ఉత్సవాలతో శుభకార్యాల్లో భక్తులకు పలు రూపాల్లో దర్శనమిస్తుంటారు. ఆ జగదైక మోహనుడు రూపం చూసి భక్తులు పరవశించిపోతారు. కళ్ల నిండుగా శ్రీవారిని చూస్తు రెప్ప వేస్తే స్వామి ఎక్కడ కనుమరుగు అయిపోతాడోనని ఒళ్లంతా కళ్లు చేసుకుని చూస్తుండిపోతారు.తన్మయత్వంలో మునిగిపోతాడు. అలా శ్రీవారు మరో శుభకార్యంతో భక్తులకు కనువిందు చేయనున్నారు.అదే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు.

తిరుమలలో మార్చి 13 నుంచి ప్రారంభమై ఐదు రోజులపాటు జరుగనున్నాయి.ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. తెప్ప అనగా ఓడ. ఓడలో శ్రీవారిని కోనేటి విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో తిరుపల్లి ఓడై తిరునాళ్‌, తెలుగులో తెప్ప తిరునాళ్లు అంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు ప్రాచీనకాలం నుంచి జరుగుతున్నాయని చరిత్ర చెబుతోంది.

ఈ ఉత్సశాల్లో భాగంగా శ్రీవారిని మొదటిరోజు సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి తెప్పలపై విహరిస్తారు. రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాడ వీధుల ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు విహరిస్తారు. ఇక చివరి మూడురోజులు శ్రీదేవి, భూదేవి స మేత మలయప్పస్వామివారు తెప్పపై విహరించనున్నారు. మూడో రోజు మూడు చుట్లు, నాలుగో రోజు ఐదు చుట్లు, ఐదో రోజు ఏడు సార్లు విహరించి భక్తులను కటాక్షిస్తారని టీటీడీ వెల్లడించింది.

తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుంచి జరుగుతున్నాయి. శ్రీ సాళువ నరసింహరాయలు క్రీ.శ 1468లో పుష్కరిణి మధ్యలో ”నీరాళి మండపాన్ని” నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. ఆ శుభకార్యక్రమాన్ని తిలకించిన అన్నమయ్య తన్మయత్వంలో మునిగిపోయారట. తెప్పోత్సవాల కారణంగా మార్చి 13,14న జరగాల్సిన వ ర్చువ ల్ అర్జిత సేవ లైన సహస్ర దీపాలంకార సేవను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. మార్చి 17తో సాలకట్ల తెప్పోత్సవాలు ముగియనున్నట్లు టీటీడీ వెల్లడించింది.