అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు.. దూకుడు పెంచిన ఈడీ..

అగ్రిగోల్డ్ కేసులో ఇప్పటికే 14 మంది నిందితులను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు కూడా తరలించారు.

Agri Gold Case (Photo Credit : Google)

Agri Gold Case : అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటును ఈడీ కోర్టు పరిగణలోకి తీసుకుంది. 32 లక్షల మంది ఖాతాదారుల నుంచి 6వేల 380 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించిన ఈడీ.. 4వేల 141 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఏపీ, తెలంగాణ, కర్నాటక, ఒడిశా, అండమాన్ నికోబార్ లోని ఆస్తులను అటాచ్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో 14 మందిని అరెస్ట్ చేసింది.

అగ్రిగోల్డ్ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే దాదాపు 32 లక్షల మంది ఖాతాదారుల నుంచి 6వేల 380 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అగ్రిగోల్డ్ ఛైర్మన్, మేనేజర్లు, వాటికి సంబంధించిన స్థిర, చర ఆస్తులు దాదాపు 4వేల 141 కోట్లను ఈడీ అధికారులు గతంలో అటాచ్ చేశారు. ఓవైపు హైకోర్టులోనూ, మరోవైపు సుప్రీంకోర్టులోనూ ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

ఇప్పుడు ఈడీ అధికారులు మళ్లీ ఛార్జ్ షీటు దాఖలు చేయగా, దాన్ని ఈడీ కోర్టు పరిగణలోకి తీసుకుంది. అగ్రిగోల్డ్ కేసులో ఇప్పటికే 14 మంది నిందితులను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు కూడా తరలించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, ఒడిశా, అండమాన్ నికోబార్ దగ్గరి నుంచి కూడా పెద్ద ఎత్తున స్థిర, చర ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేసినట్లు ఛార్జ్ షీటులో పొందుపరిచారు.

మొత్తం మీద చాలామంది బాధితులు(32 లక్షల మంది) నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన అగ్రిగోల్డ్ లో చాలా మంది బాధితులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, ఒడిశా, మహారాష్ట్రకు చెందిన అనేక మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. వీరందరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సైతం దూకుడు పెంచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని ఆస్తులను జప్తు చేసి.. అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చారు.

 

 

Also Read : అలాంటి సైకోలను వదలొద్దు, వారి అంతు చూడండి- చంద్రబాబు ప్రభుత్వానికి షర్మిల విజ్ఞప్తి..