agri labour dies in nellore district : నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కలువాయి మండలం వెలుగొట్లపల్లిలో వరి నాట్లు వేయడానికి 70 మంది వలస కూలీలు పశ్చమ బెంగాల్ నుండి వచ్చారు. ఓ రైతు పొలంలో వరినాట్లు వేస్తుండగా 10 మంది అస్వస్ధతకు గురయ్యారు.
అందులో ఒకరు మృతి చెందారు. అస్వస్ధతకు గురైన వారిలో ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉండడంతో నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో ఆరుగురు కూలీలు మాత్రం పొదలకూరు ప్రభుత్వ వైద్యశాలలో చికత్స పొందుతున్నారు.
ఒక మహిళకు సీరియస్ గా ఉండడంతో బాధిత మహిళల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా ఏలూరులో జరిగిన ఘటనను గుర్తుచేసుకుని మండల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. అస్వస్ధతకు గురైన వారిని పరీక్షించిన వైద్యులు మాత్రం ఫుడ్ పాయిజన్ అయిందని తెలిపారు.