Officer Suicide: కార్యాలయంలో వ్యవసాయశాఖ ఉద్యోగిని ఆత్మహత్య

కుమారుడు కరోనాతో మృతి చెందడం.. అనంతరం ఇంట్లో ఆస్తి తగాదాలు మొదలవడంతో వ్యవసాయశాఖలో పనిచేస్తున్న ఉద్యోగిని ఉమాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గుంటూరులో చోటుచేసుకుంది.

Officer Suicide

Officer Suicide: కుమారుడు కరోనాతో మృతి చెందడం.. అనంతరం ఇంట్లో ఆస్తి తగాదాలు మొదలవడంతో వ్యవసాయశాఖలో పనిచేస్తున్న ఉద్యోగిని ఉమాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు ఉమాదేవి కుమారుడు బాజీ కిరణ్ ఈ నెల 8న కరోనాతో మృతి చెందాడు. నాటి నుంచి ఆస్తి విషయంలో వివాదం జరుగుతోంది.

ఈ క్రమంలోనే శనివారం తాను పనిచేస్తున్న వ్యవసాయశాఖ కార్యాలయంలోని భూసార పరీక్షాకేంద్రంలో ఒంటిపై యాసిడ్ పోసుకున్నారు. అనంతరం గట్టిగ కేకలు వేశారు. దీంతో స్థానికులు పరిగెత్తుకెళ్లి ఆమెను జీజీహెచ్ కు తరలించారు. పరిష్టితి విషమించడంతో చికిత్స పొందుతూ ఉమాదేవి మృతి చెందారు. అయితే ఆమె ఆత్మహత్యకు నగరపాలెం పోలీసులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఓ కేసు విషయంలో ఉమాదేవిని పోలీసులు విచారణ పేరుతో వేధించారని వారి వేధింపులు తాళలేక ఉమాదేవి ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.