Alla Nani : కేంద్ర నిఘా వ్యవస్థ పవన్ చుట్టూ ఉందా?.. పవన్ చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నాడు

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు, పవన్ ఫామ్‌హౌస్‌లలో ఉన్నారు.. ఏపీ‌లో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేసింది వాలంటీర్లు. అలాంటి వాలంటీర్లను బ్రోకర్ల‌తో పోల్చి, వారి కుటుంబాలను పవన్ బాధించారని ఆళ్ల నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Alla Nani Counter To Pawan

Alla Nani Counter To Pawan : ఏలూరులో వారాహి యాత్రలో పవన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఆళ్ల నాని ఫైర్ అయ్యారు. ప్రజాప్రతినిధులు, వైకాపా నేతలపై వ్యక్తి గత విమర్శలు తప్ప వారాహి యాత్ర వల్ల ప్రజలకు ఉపయోగం లేదని అన్నారు. జగన్ పేరు ఉచ్చరించే స్థాయి, అర్హత పవన్ కళ్యాణ్‌కు లేదని అన్నారు. సీఎం జగన్‌ను నువ్వు అని ఏకవచనంతో విమర్శించడానికి పవన్ ఏలూరు వచ్చారా? అంటూ ఆళ్ల నాని ప్రశ్నించారు. ఒకవేళ అధికారంలోకివస్తే ఏమి ఉద్దరిస్తారో కూడా పవన్ సభలో చెప్పలేదు. పాదయాత్ర చేస్తే ప్రజలకు నష్టం అని కుంటి సాకులు చెప్పి సినిమా షూటింగ్‌లు చేసిన వ్యక్తి పవన్ అంటూ విమర్శించారు. ప్రజల్లో పాదయాత్ర చేసి సీఎం అయ్యి, 99శాతం హామీలు నెరవేర్చిన జగన్‌ను విమర్శించే హక్కు పవన్‌కు లేదని అన్నారు.

Pawan Kalyan : పవన్ వ్యాఖ్యలతో దుమారం.. ఆరోపణల్లో పసెంత..?

ఏలూరులో అంబేద్కర్ సాక్షిగా పవన్ పచ్చి అబద్ధాలు మాట్లాడారు అంటూ ఆళ్ల నాని విమర్శించారు. ఇంకా 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లోకూడా యాత్రలు చేయని పవన్‌కు అప్పుడే నిరాశ ఎదురైంది అంటూ ఎద్దేవా చేశారు. వాలంటీర్ల వ్యవస్థ గురించి ఏ అవగాహన లేకుండా పవన్ నీచమైన వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. అసాంఘిక శక్తులకు వాలంటీర్లు ప్రజల సమాచారాన్ని చేరవేస్తున్నారనడం దౌర్భాగ్యం అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు, పవన్ ఫామ్‌హౌస్‌లలో ఉన్నారు.. ఏపీ‌లో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేసింది వాలంటీర్లు. అలాంటి వాలంటీర్లను బ్రోకర్ల‌తో పోల్చి, వారి కుటుంబాలను పవన్ బాధించారని ఆళ్ల నాని అన్నారు.

Pawan Kalyan : సీఎం పదవికి జగన్ అనర్హుడు, చావుకైనా సిద్ధమే- పవన్ కల్యాణ్

కేంద్ర నిఘా వ్యవస్థ పవన్ చుట్టూ ఉందా? చంద్రబాబు నిఘా వ్యవస్థ, స్క్రిప్ట్ చదివి పవన్ మాట్లాడుతున్నారు అంటూ ఆళ్ల నాని విమర్శించారు. తుపాకులు వెంట పెట్టుకునే వ్యవస్థ మీది. ఏలూరు వింత వ్యాధి‌పై పవన్ అవగాహన లేకుండా మాట్లాడారు. సీఎం జగన్ ఆనాడు కేంద్ర ఆరోగ్య, నిపుణుల సంస్థలతో వింత వ్యాధితో దర్యాప్తు చేయించారని అన్నారు. ఎన్ని విమర్శలు చేసినా, 175 స్థానాలు గెలిచి జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయమని ఆళ్ల నాని దీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక్క సీటు ఇవ్వకపోవడమే కాదు, వారాహి యాత్ర‌ను ప్రజలు అడ్డుకునే రోజులు ముందున్నాయని పవన్ కళ్యాణ్ ను హెచ్చరించారు.

ట్రెండింగ్ వార్తలు