Kottu Satyanarayana (Photo : Google)
Kottu Satyanarayana – Srivani Trust : శ్రీవాణి ట్రస్ట్ పై ఆరోపణలు చేయడం దుర్మార్గం అన్నారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. పారదర్శకంగా శ్రీవాణి ట్రస్ట్ నిధులు ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నామని ఆయన వివరించారు. 1917 ఆలయాల నిర్మాణాలకు డబ్బులు ఖర్చు చేశామన్నారు. మరో 70 ఆలయాలకు శాంక్షన్ చేశామన్నారు. ప్రతి ఆలయంలో ఫ్రీ ఆడిట్ పెట్టామన్నారు. దేవాలయాల్లో పనులు చేస్తే 5 రోజుల్లో బిల్లులు చెల్లించేలా ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు. మూడు జోన్లలో ప్రతి మూడేళ్లకొకసారి అధికారులు జువెలరీ వెరిఫికేషన్ చేస్తారని మంత్రి పేర్కొన్నారు.
” 2019 నుంచి రూ.450 కోట్లు సీజేఎఫ్ ద్వారా విడుదల చేశాం. సీఎం నిధులతో కనకదుర్గమ్మ ఆలయంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. రూ.57 కోట్లతో ప్రసాదం పోటు, అన్నదానం ఏర్పాటు చేస్తున్నాం. కనకదుర్గానగర్ నుంచి ఇంద్రకీలాద్రి క్యూలైన్ దాకా ఫ్లైఓవర్ ను తీసుకొస్తున్నాం. సీఎం నిధులతో పాటు దేవస్ధానం నుంచి మరో రూ.125కోట్లతో దేవస్ధానంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. శ్రీశైలం దేవస్థానంలోనూ క్యూకాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నాం. శ్రీశైలంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి” అని మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు.
”పవన్ వారాహి యాత్ర అట్టర్ ఫ్లాప్. సీఎం అయ్యే స్ధాయి నాకు లేదని ఓ సభలో పవన్ చెప్పారు. మరో సభలో సీఎం పదవి ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానంటారు. ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్ ను స్వీకరించలేక పవన్ తోకముడిచాడు. ముద్రగడపై పవన్ వ్యాఖ్యలతో కాపుల మనోభావాలు దెబ్బతిన్నాయి. చంద్రబాబు ఏం చెప్పమంటే పవన్ అదే చెప్తున్నాడు.
కాపులకు అన్యాయం చేసిన చంద్రబాబుతో పవన్ అంటకాగి కాపులనే తిడుతున్నాడు. కాపుల్లో పరివర్తన లేదని పవన్ ఉద్దేశ్యమా? కాపుల్లో చీలికలకు చంద్రబాబు యత్నిస్తున్నారా? వంగవీటి రంగా హత్యలో చంద్రబాబు హస్తం ఉందని జగమెరిగిన సత్యం. ముద్రగడ కుటుంబంపై దాడి జరిగితే పవన్ స్పందించ లేదు. చంద్రబాబుతో పవన్ మమేకమైపోయాడు. పవన్ మతి ఉండి మాట్లాడుతున్నాడు లేదో అర్ధం కావడం లేదు.
Also Read..Pawan Kalyan : తూర్పుకాపుల్లో బలమైన నాయకులున్నా.. వారు వెనుకబడే ఉన్నారు : పవన్ కల్యాణ్
ముద్రగడకు వ్యతిరేకంగా ప్లకార్డులు, ఫ్లెక్సీలు పెట్టించింది పవనే. చంద్రబాబు డైరెక్షన్ లో ప్లకార్డులు ప్రదర్శించింది, పెద్దాయనను విమర్శించ వద్దనేది నాటకమే. ఎందుకీ ద్వంద్వ వైఖరి. గత పది రోజుల్లో పవన్ మాట్లాడిన మాటలు, హావభావాలు చూస్తుంటే.. పవన్ మానసిక పరిస్ధితిపై ఆలోచన చేయాల్సి ఉంది” అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.