పోలీసులకు ఆమంచి సోదరుడు హెచ్చరిక

  • Publish Date - November 6, 2020 / 03:01 PM IST

amanchi brother swamulu warns police : పోలీసులకు ఆమంచి సోదరుడు ఆమంచి స్వాములు హెచ్చరిక జారీ చేశారు. అసలు విషయాలు తెలుసుకోవాలని సూచించారు. ఎవరో నాయకులు ఇచ్చిన ఆదేశాలు పాటిస్తే..చీరాలలో భద్రతా వ్యవస్థకి విఘాతం కలుగుతుందని, చిన్న విషయాలకు పెద్ద ఘర్షణలు సృష్టిస్తున్న వారిని క్షమించమన్నారు. ఉడత బెదిరింపులకు ఎవరూ భయపడమని స్పష్టం చేశారాయన.



ప్రకాశం జిల్లా చీరాలలో వైసీపీ వర్గపోరు పీక్ స్థాయికి చేరుకొంటోంది. కరణం బలరాం X ఆమంచి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇటీవలే రెండు వర్గాల మధ్య గొడవలు చెలరేగిన సంగతి తెలిసిందే. పరస్పరం దాడులకు దిగడంతో చీరాలలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. అక్టోబర్ 31 రాత్రి చీరాలలో కరణం బలరాం పుట్టినరోజు వేడుక సందర్భంగా ఇద్దరు లీడర్ల కేడర్ మధ్య.. వార్ నడిచింది.



https://10tv.in/what-happend-in-amanchi-krishna-mohan-native-place/
బర్త్‌డే వేడుకల్లో జరిగిన గొడవ చల్లారకముందే మరోసారి చీరాలలో మళ్లీ చిచ్చు రేగింది. ప్రజా సంకల్ప యాత్ర సంబరాల వేళ.. చీరాలలో 2020, నవంబర్ 05వ తేదీ గురువారం రాత్రి అధికార పార్టీ నేతల వర్గపోరు మరోసారి బయటపడింది. నియోజకవర్గంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా.. వర్గపోరుతో చీరాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.



ఈ రెండు వర్గాలను అదుపు చేయడం పోలీసులకు సవాల్‌ మారింది. ఈ క్రమంలో ఆమంచి సోదరుడు ఆమంచి స్వాములు పోలీసులకు హెచ్చరిక చేయడంతో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాలి.