Amaravati New Look : అమరావతి విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది. చంద్రబాబు ప్రమాణస్వీకారం నేపథ్యంలో రాజధాని ప్రాంతం ధగధగ మెరిసిపోతోంది. అమరావతి ప్రాంతం కళకళలాడుతోంది. విద్యుత్ కాంతులతో రాజధాని నగరం మిరుమిట్లు గొల్పుతోంది. వివిధ శాఖలకు సంబంధించిన సిబ్బంది రాత్రి, పగలు పని చేస్తున్నారు. తీవ్రంగా శ్రమించి పిచ్చి చెట్లు, ముళ్ల చెట్లను తొలగించేశారు. విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న నగరాన్ని చూసి దాదాపు ఐదేళ్లు అవుతోందని స్థానికులు చెబుతున్నారు.
ఏపీ రాజధాని అమరావతే అని తేల్చి చెప్పిన చంద్రబాబు.. ఇదే ప్రజా రాజధాని అని, ఇక్కడి నుంచే పరిపాలన చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. రాజధాని నిర్మాణం కోసం అక్కడి రైతులు 34వేల ఎకరాల భూమిని స్వచ్చందంగా ఇచ్చారు. దాదాపు 104 ప్రాంతాల్లో జంగల్ క్లియరెన్స్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఈ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండేదని, అటుగా వెళ్లాలంటే భయానకమైన పరిస్థితులు ఉండేవని స్థానికులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితి నుంచి తమ ప్రాంతం ఇప్పుడు బయటపడిందని, సందర్శకుల రాక పెరిగిందని, విద్యుత్ కాంతులతో తమ ప్రాంతం మెరిసిపోతోందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఏపీ ప్రజలు ఆశిస్తున్నదేంటి? చంద్రబాబు ముందున్న లక్ష్యమేంటి? నవ్యాంధ్రలో నవశకం తీసుకురాబోతున్నారా?