Ambati Rambabu: రాష్ట్రంలో ఇక టీడీపీ శకం ముగిసినట్లే

టీడీపీ ఎన్నికలు బహిష్కరించడానికి ఓటమి భయమే కారణమని వైస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

Ambati Rambabu: టీడీపీ ఎన్నికలు బహిష్కరించడానికి ఓటమి భయమే కారణమని వైస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అంటున్నారు. రాష్ట్రంలో ఇక టీడీపీ శకం ముగిసినట్లేనని విమర్శించారు.

మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఎస్‌ఈసీ నీలం సాహ్ని రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నారని చెప్పారు. భవిష్యత్‌లో తెలుగుదేశం పార్టీని కూడా చంద్రబాబు రద్దు చేస్తారన్నారు. ఇకనైనా టీడీపీ తరఫున పోటీ చేసేవాళ్లంతా ముందుచూపుతో తప్పుకోవాలని అంబటి సూచించారు.

పలువురు నేతలు చంద్రబాబు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే క్రమంలో టీడీపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా ఇచ్చేశారు. పరిషత్ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించడంతోనే తాను రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. చంద్రబాబు నిర్ణయం తనను, కార్యకర్తలను బాధపెట్టిందని చెప్పారు. జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గా కొనసాగుతానని వెల్లడించారు.

మరోవైపు పార్టీ నిర్ణయానికి భిన్నంగా స్పందించారు అశోక్ గజపతిరాజు. పరిషత్ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై వ్యతిరేకత వచ్చిందన్నారు. టీడీపీ అభ్యర్థుల పోటీపై కేడర్ అభిప్రాయం తీసుకోవాల్సిందని చెప్పారు. టీడీపీ ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్న రాజకీయ పార్టీగా ఆశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. పోటీలో గెలిచినా, గెలవకపోయినా సిద్ధాంతాలు వదులుకోకూడదన్నారు.

ట్రెండింగ్ వార్తలు