Ambati Rambabu : అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తారు : మంత్రి అంబటి

చంద్రబాబు అర్ధాంతరంగా తన రూట్ ను మార్చుకుని పుంగనూరు రావాలని అనుకోవడమే ఆయన చేసిన తప్పు అన్నారు. చంద్రబాబుకు బుర్ర పని చేయడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Ambati Rambabu Fire Chandrababu

Ambati Rambabu Fire Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమ పర్యటనపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పుంగనూరులో పోలీసులపై దాడి దారుణం అన్నారు. పుంగనూరులో వైఎస్సాఆర్ పార్టీ కార్యకర్తలకు, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు మధ్య జరిగినటువంటి తగాదా కాదన్నారు. అది పోలీసులకు చంద్రబాబుకు మధ్య జరిగిన తగాదా అని పేర్కొన్నారు.

ఈ మేరకు ఆదివారం అంబటి రాంబాబు తూర్పుగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడారు. అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తారని పేర్కొన్నారు. అధికారం కావాలనే అతృతతో గందరోగాళాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అధికారం కోసం ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రూట్ మ్యాప్ ను చంద్రబాబు అతిక్రమించారని తెలిపారు.

MLA Rajasingh: వచ్చేసారి నేను ఉండకపోవచ్చు.. అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..

చంద్రబాబు అర్ధాంతరంగా తన రూట్ ను మార్చుకుని పుంగనూరు రావాలని అనుకోవడమే ఆయన చేసిన తప్పు అన్నారు. చంద్రబాబుకు బుర్ర పని చేయడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సింహమంటే నవ్వు వస్తుందన్నారు. సింహంతో చంద్రబాబు పోల్చుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.