సంఘ సంస్కర్త, మరణం లేని మహనీయుడు అంబేద్కర్- సీఎం జగన్

ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు ధైర్యాన్ని ఇస్తుంది. మహా శక్తిగా తోడుగా నిలబడుతుంది. గొప్పగా చదువుకున్న విద్యా విప్లవం అంబేద్కర్.

Ambedkar Statue Inauguration

CM Jagan : బెజవాడ నగరం నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా సామాజిక సమతా సంకల్ప సభలో ఏపీ సీఎం జగన్ మాట్లాడారు. సంఘ సంస్కర్త, మరణం లేని మహనీయుడి విగ్రహం విజయవాడలో ఆవిష్కృతమైందన్నారు. బాబా సాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ బతికి ఉంటారని చెప్పారు. మన అడుగుల్లో ఆయన ఎప్పటికీ కనిపిస్తారని అన్నారు.

”పెత్తందారి, అంటరానితం, కుల అహంకార వ్యవస్థల దుర్మార్గుల మీద, ఆ దుర్మార్గాల మీద, అక్క చెల్లెళ్లపై వివక్ష మీద పోరాటాలకు నిరంతరం స్ఫూర్తిని ఇస్తూనే ఉంటారు ఆ మహా మనిషి. స్వాతంత్ర్య సమర చరిత్ర ఉన్న మన స్వరాజ్య మైదానంలో 75వ రిప్లబిక్ డేకు సరిగ్గా వారం రోజుల ముందు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం. పేదలు, మహిళలు, మానవ, ప్రాథమిక, రాజ్యాంగ హక్కులకు, సమానత్వ ఉద్యమాలకు నిరంతరం కూడా ఈ విగ్రహం స్ఫూర్తి నిస్తుంది.
అంటరానితనం మీద, ఆధిపత్య భావజాలం మీద ఓ తిరుగుబాటుగా ఆయన విగ్రహం చూసినప్పుడల్లా మనకు కనిపిస్తూనే ఉంటారు.

Also Read : జగన్ ఆస్తుల కేసు విచారణ ఎందుకు ఆలస్యమవుతుంది? ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రశ్నించిన సుప్రీంకోర్టు

రాజ్యాంగ హక్కులు, న్యాయాల ద్వారా మనల్ని నిరంతరం కాపాడే ఒక మహా శక్తిగా ఆయన మనందరికి స్ఫూర్తిని ఇస్తూనే ఉంటారు. గొంతు వినిపించలేని అట్టడగువర్గాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడానికి, రిజర్వేషన్లు కల్పించడానికి కారకులు అంబేద్కర్. నేడు దళిత జాతి నిలబడిందంటే వారికి అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించడమే కారణం. దళితులను ఏకతాటిపైకి తెచ్చిన గొప్ప వ్యక్తి అంబేద్కర్. ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు ధైర్యాన్ని ఇస్తుంది. మహా శక్తిగా తోడుగా నిలబడుతుంది. గొప్పగా చదువుకున్న విద్యా విప్లవం అంబేద్కర్. అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉందని విన్నాం. ఇక స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే విజయవాడ పేరు మారుమోగుతుంది” అని సీఎం జగన్ అన్నారు.

Also Read : జూ.ఎన్టీఆర్‌ ఫ్లెక్సీల తొలగింపు దేనికి సంకేతం? వివాదానికి అసలు కారణం ఏంటి?