Nara Lokesh : చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం లేదని అమిత్ షా చెప్పారు : నారా లోకేశ్

చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం లేదు అని అమిత్ షా చెప్పారని విషయాన్ని వెల్లడించారు లోకేశ్. చంద్రబాబు ఆరోగ్యం గురించి అడిగారని ..తెలిపారు.

amit shah..Nara lokesh

Amit shah Nara lokesh : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన నారా లోకేశ్ తిరిగి బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో వారి మధ్య జరిగిన సంభాషణను వెల్లడించారు. తాను బుధవారం రాత్రి కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశానని ఏపీలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని.. కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరానని తెలిపారు. తమపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. కిషన్ రెడ్డి ఫోన్ చేసి అమిత్ షాతో సమావేశం ఏర్పాటు చేశారని ఈ సమావేశంలో ఏపీలో జరుగుతున్న కక్ష సాధింపు చర్యలపై జోక్యం చేసుకోవాలని కోరానని వెల్లడించారు.

చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం లేదని అమిత్ షా చెప్పారని లోకేశ్ వెల్లడించారు. సీఐడీ మిమ్మల్ని ఎందుకు విచారణకు పిలిచింది..? అని అమిత్ షా తనను అడిగారని దానికి తాను జరిగిన విషయం చెప్పానని అన్నారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి అడిగారని .. కానీ జైల్లో చంద్రబాబు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారని.. జైలులో భద్రతాపరంగా ఇబ్బందులు కూడా ఉన్నాయని కూడా చెప్పానని వెల్లడించారు. తమ మధ్య రాజకీయాల గురించి ఎటువంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు.

Also Read : ఏపీ హైకోర్టులో లోకేష్ కు ఊరట.. ముందస్తు బెయిల్ పిటిషన్ క్లోజ్ చేసిన ధర్మాసనం

కాగా.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో లోకేశ్ కు ఈ రోజు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు క్లోజ్ చేసింది. లోకేశ్ ను ముద్దాయిగా చూపలేదని సీఐడీ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో లోకేశ్ ను ముద్దాయిగా చూపలేదని సీఐడీ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. లోకేశ్ ను ముద్దాయిగా చూపనందున అయనను అరెస్టు చేయబోమంటూ సీఐడీ అధికారులు హైకోర్టుకు వివరించారు. దీంతో ఈ పిటిషన్ ను హైకోర్టు మూసివేసింది.

ట్రెండింగ్ వార్తలు