Ammavodi: వరుసగా మూడో ఏడాది అమ్మఒడి అందుకుంటున్న శ్రీకాకుళం

పేద పిల్లల చదువులకు ఆర్థిక సాయం అందించి సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన జగనన్న అమ్మ ఒడి పథకం వరుసగా మూడో ఏడాది (2021–22) విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పథకం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

Ammavodi: పేద పిల్లల చదువులకు ఆర్థిక సాయం అందించి సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన జగనన్న అమ్మ ఒడి పథకం వరుసగా మూడో ఏడాది (2021–22) విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పథకం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ చదువుతున్న 82లక్షల 31వేల 502 మంది విద్యార్ధులకు అమ్మ ఒడితో లబ్ధి చేకూరుస్తూ 43లక్షల 96వేల 402 మంది తల్లుల ఖాతాల్లో రూ.6వేల 595 కోట్లను జమ చేయనున్నారు.

ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం శ్రీకాకుళంలో జరగనున్న కార్యక్రమంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి డిపాజిట్ ప్రక్రియ చేపట్టనున్నారు. తాజాగా ఇచ్చే సొమ్ముతో కలిపి ఇప్పటివరకు “జగనన్న అమ్మ ఒడి పథకం” ద్వారా ప్రభుత్వం మొత్తం దాదాపు రూ.19వేల 618 కోట్లు అందించినట్లు రికార్డులు చెబుతున్నాయి.

Read Also : ‘అమ్మ ఒడి’ నగదు బదులు ల్యాప్‌ టాప్‌లు..

సెప్టెంబర్‌ నుంచి విద్యాసంస్ధలు యథావిధిగా పని చేస్తున్నందున 75 శాతం అటెండెన్స్ కండీషన్ అమలు చేస్తున్నారు. దీనివల్ల 2021–22లో 51వేల మంది అమ్మ ఒడికి అనర్హులుగా ఉండిపోయారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్ధితి తలెత్తకుండా పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపి కనీసం 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండేలా తల్లులే బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు.

శ్రీకాకుళానికి సీఎం
సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. 11 గంటలకు శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అమ్మ ఒడి పథకం లబ్ధిదారులతో ముఖాముఖి అనంతరం ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు తిరిగి బయలుదేరి 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

ట్రెండింగ్ వార్తలు