Gorantla Madhav video not original
Gorantla Madhav video not original : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజనల్ కాదని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప పేర్కొన్నారు. ఒరిజనల్ వీడియో దొరికేంతవరకు నిజానిజాలు తెలియవని స్పష్టం చేశారు. పోస్టు చేసిన వ్యక్తి పలుమార్లు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో స్పష్టమైన ఆధారాలు లభించడం లేదని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చింది మార్ఫింగేనని స్పష్టం చేశారు.
మార్ఫింగ్ వీడియోను మొదట ఈనెల 4న ఐ టీడీపీ అఫిషియల్ అనే వాట్సాప్ గ్రూప్‌లో +447443703968 అనే నంబర్‌తో యూకే నుంచి పోస్టు చేశారని తెలిపారు. ఒక వ్యక్తి రికార్డ్ చేసిన వీడియోను ఇంకొకరికి పంపించి ఆ వ్యక్తి తన మొబైల్‌లో చూస్తున్నప్పుడు మరో వ్యక్తి ఆయన మొబైల్ ఫోన్‌లోని వీడియోను చిత్రీకరించి ఆ వీడియోను వైరల్ చేశారని పేర్కొన్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో పలుమార్లు ఫార్వర్డ్, రీపోస్టు చేశారని, ఇలా అనేకసార్లు ఫార్వర్డ్ చేయడం వల్ల ఒరిజినల్ అని నిర్ధారించలేకపోతున్నామని చెప్పారు. ఈ వీడియో ఒరిజినల్ కాదని.. మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. బాధితులు ఎవరూ కూడా ఫిర్యా దు చేయలేదన్నారు. ఒకవేళ బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తే ఎంపీ గోరంట్ల మాధవ్ ఫోన్‌పై కూడా దర్యాప్తు చేస్తామని అన్నారు.