Gorantla Madhav Video : ‘ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో ఓవర్ చేయొద్దు’..అంటూ వంగలపూడి అనితకు వైసీపీ కార్యకర్త బెదిరింపు

టిడిపి మహిళా నేత..మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు ఓ వైసీపీ కార్యకర్త నుంచి బెదిరింపు కాల్ వచ్చింది.ఫోన్ చేసిన వ్యక్తి “మీరు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. కాస్త తగ్గించుకొంటే మంచిది..లేదంటే అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.

Gorantla Madhav Video : ‘ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో ఓవర్ చేయొద్దు’..అంటూ వంగలపూడి అనితకు వైసీపీ కార్యకర్త బెదిరింపు

threatning call to vangalapudi anita..YCP MP Gorantla Madhav video

threatning call to vangalapudi anita..YCP MP Gorantla Madhav video : టిడిపి మహిళా నేత..మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు ఓ వైసీపీ కార్యకర్త నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. అనిత విజయవాడలో ఏపీ మహిళా హక్కుల పరిరక్షణ సమితి రౌండ్ టేబుల్సమావేశంలో ఉండగా అనితకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. వైసీపీ కార్యకర్త నుంచి బెదిరింపు కాల్ రావడంతో ఆమె ఫోన్‌ స్పీకర్ ఆన్‌ చేసి అక్కడే ఉన్న మీడియా ముందే అతనితో మాట్లాడారు. ఫోన్ చేసిన వ్యక్తి “మీరు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. కాస్త తగ్గించుకొంటే మంచిది..రాష్ట్రంలో ఎన్నో ఘటనలు జరుగుతుంటే ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంపైనే ఎందుకు రాద్దాంతం చేస్తున్నారు? అయినా ఆయన ఏం తప్పు చేశారని ఇలా అతిగా స్పందిస్తున్నారు ఏదో చిన్నతప్పుకే అంత ఓవర్ చేయాలా? అంత అవసరం లేదు..లేదంటే మీ నేతలు చేసిన బాగోతాలను కూడా బయటపెడతాను అంటూ 98480 75369 నుంచి ఫోన్ చేసిన వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు.

అతని బెదిరింపులకు వంగలపూడి అనిత కూడా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. నేను వాస్తవారలు మాత్రమే మాట్లాడుతున్నాను..ఏ.. ఎందుకు మాట్లాడకూడదు? మీ ఎంపీ తప్పు చేస్తే నిలదీయకుండా చేతులు ముడుచుకొని కూర్చోవాలా?నన్ను బెదిరించడం దేనికి? దమ్ముంటే నీ దగ్గరున్న ఆ వీడియోలను కూడా బయటపెట్టు. ఇంతకీ మీ ఎంపీ చేసింది తప్పే అని నువ్వు అనుకొంటున్నావా లేదా? తప్పనుకొంటే ఇంతవరకు అతనిమీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? తప్పుచేయలేదనుకొంటే అదే మాట మీ పార్టీ చేత చెప్పించు చూద్దాం,” అంటూ కడిగిపడేశారు అనిత. దాంతో అతను ‘మీకో దణ్ణం…’ అంటూ ఫోన్‌ పెట్టేశాడు.

అనంతరం వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ర్యలు తీసుకొంటే..వైసీపీలో ఇంకెంతమంది నేతల భాగోతాలు బయటపడతాయో… అలా అందరిపై చర్యలు తీసుకోవడం మొదలుపెడితే పార్టీ ఖాళీ అయిపోతుందనే జగన్ భయపడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు వంగలపూడి అనిత.

కాగా..హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ (Gorantla Madhav Video Call) వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ వీడియోలో గోరంట్ల మాధవ్ మహిళతో మాట్లాడుతూ అసభ్య చేష్టలకు పాల్పడినట్లు కనిపిస్తుంది. ఇది గురువారం ఉదయం నుంచి ఏపీలో రాజకీయ రచ్చకు దారితీసింది. వైసీపీ నుంచి ఎంపీ మాధవ్ ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. చేస్తునే ఉన్నారు. గోరంట్ల మాధవ్ వీడియో ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.