Gold Coins Found : పొలంలో పైపులైన్ తవ్వుతుండగా.. పురాతనకాలం నాటి బంగారు నాణాలు లభ్యం

ఏలూరు జిల్లాలో పురాతనకాలం నాటి బంగారు నాణాలు లభ్యమయ్యాయి. కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెంలోని పొలంలో పైపులైన్ తవ్వుతుండగా పురాతన కాలం నాటి బంగారు నాణాలు లభ్యం అయ్యాయి.

Gold Coins Found : ఏలూరు జిల్లాలో పురాతనకాలం నాటి బంగారు నాణాలు లభ్యమయ్యాయి. కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెంలోని పొలంలో పైపులైన్ తవ్వుతుండగా పురాతన కాలం నాటి బంగారు నాణాలు లభ్యం అయ్యాయి. జంగారెడ్డిగూడెంకు చెందిన మానుకొండ సత్యనారాయణ, మానుకొండ తేజశ్రీకి చెందిన పొలంలోని ఆయిల్ ఫామ్ తోటలో గత నెల 29వ తేదీన పైపు లైన్ కోసం తవ్వుతుండగా బంగారు నాణాలు ఉన్న మట్టి పిడత దొరికింది. మట్టి పిడతలోని బంగారు నాణాలు ఒక్కొక్కటి 3 గ్రాముల చొప్పున ఉన్నాయి.

164 Rare Coins : మధ్యప్రదేశ్ లోని ఇసుక క్వారీలో బయటపడ్డ 164 పురాత‌న నాణేలు

మానుకొండ సత్యనారాయణ బంగారు నాణాలను రెవెన్యూ అధికారులకు అప్పగించారు. సుమారు 18 బంగారు నాణాలను రెవెన్యూ అధికారులు ట్రెజరీకి తరలించారు. అయితే నాణాలు దొరికి నాలుగు రోజులు కావడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఎక్కువ నాణాలు దొరికితే తక్కువగా చూపి అధికారులకు అప్పగించారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు