164 Rare Coins : మధ్యప్రదేశ్ లోని ఇసుక క్వారీలో బయటపడ్డ 164 పురాత‌న నాణేలు

మధ్యప్రదేశ్ లో ఇసుక క్వారీలో 164 పురాత‌న నాణేలు బయటపడ్డాయి. ఓ కుండలో బయటపడ్డ ఈ నాణాల్లో వెండి రాగి నాణాలు ఉన్నాయి.

164 Rare Coins : మధ్యప్రదేశ్ లోని ఇసుక క్వారీలో బయటపడ్డ 164 పురాత‌న నాణేలు

164 Rare Coins

164 rare coins found in Bundelkhand : మ‌ధ్య‌ప్ర‌దేశ్ తిక‌మ్‌గ‌ర్హ్ జిల్లాలో పురాతన కాలంనాటి నాణాలు బయటపడ్డాయి. ఓ ఇసుక క్వారీ తవ్వుతుండగా 164 పురాత‌న నాణేలు బయటపడ్డాయి. ఈ నాణాలను పరిశీలించిన పరిశోధకలు ఇవి మొఘలుల కాలం నాటివిగా భావిస్తున్నామని జిల్లా మైనింగ్ అధికారి ప్రశాంత్ తివారీ తెలిపారు. ఇసుక క్వారీలో ప‌నులు చేస్తుండ‌గా ఓ కుండ బ‌య‌ట‌ప‌డింది. దీంట్లో పురాత‌న నాణేలు ల‌భించిన‌ట్లు అధికారులు తెలిపారు.

బుందేల్‌ఖాండ్ బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని జిల్లా కేంద్రానికి 55 కిలోమీటర్ల దూరంలోని నందనవర గ్రామంలో ఓ ప్ర‌వేయిటు కాంట్రాక్ట‌ర్‌కు చెందిన మైనింగ్‌లో ఇసుక క్వారీని తవ్వుతుండగా ఈ పురాత‌న నాణేలు ల‌భ్య‌మైయ్యాయి. ఆ నాణేలు బ‌య‌ట‌ప‌డ్డ ప్ర‌దేశాన్ని మైనింగ్ అధికారి ప్రశాంత్ తివారీ ప‌రిశీలించారు. బయటపడ్డ ఈ 164 నాణేల్లో 12 వెండి నాణేలు ఉన్నాయ‌ని..మిగ‌తావి కాప‌ర్ నాణేలు అని తెలిపారు. ఈ నాణేలన్నింటిని జిల్లా ట్రెజ‌రీ కార్యాల‌యానికి త‌ర‌లించారు. కాగా బుందేల్‌ఖాండ్ రీజియ‌న్‌లో ఒక‌ప్పుడు ఆఫ్ఘ‌న్స్‌, మొఘ‌ల్స్ త‌మ సామ్రాజ్యాన్ని నెల‌కొల్పారు.

Read more : Ancient Wine Factory:తవ్వకాల్లో బయటపడ్డ 1500 ఏళ్ల నాటి మద్యం ఫ్యాక్టరీ..పరిశోధనలో విస్తుగొలిపే విషయాలు..

ఈ నాణాలపై ఉన్న భాషల్ని ఉర్ధూ గానీ..పర్షియన్ భాషలుగా భావిస్తున్నారు. ఈ భాషను బట్టి ఈ నాణేలు ఏ కాలానికి చెందినవో పరిశోధకులు తెలుసుకోనున్నారు. నివారి జిల్లాలోని నందనవారా గ్రామానికి 45 కి.మీ దూరంలో ఉన్న ఓర్చా, రామ్ రాజా ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఇది నివారి జిల్లా 2018లో తికమ్‌ఘర్ నుండి విడిపోయింది.

Read more : fist Toothbrush History:కీ.పూర్వం 3000 ఏళ్లకు ముందే టూత్‌ బ్రష్‌ వినియోగం..ఫస్టుబ్రష్ దేంతో తయారు చేసారో తెలిస్తే షాక్

బుందేల్‌ఖండ్‌లోని ఈ ప్రాంతం ఆఫ్ఘన్‌లు,మొఘల్‌ల పాలించారు. వారి ఆనవాళ్లు పలు సందర్భాల్లో ఈ ప్రాంతాల్లో బయటపడ్డాయి. చరిత్ర ప్రకారం.. జుజార్ సింగ్ 1626లో ఓర్చా రాజు అయ్యాడు. మొఘల్ సామ్రాజ్యానికి సామంతుడిగా ఉండనని ప్రతిజ్ఞ చేశాడు ఓర్చా రాజు జుజార్ సింగ్. మొఘల్ చక్రవర్తి షాజహాన్ నుండి స్వాతంత్ర్యం పొందేందుకు అతని ప్రయత్నం అతని పతనానికి మార్గమైందని చరిత్ర చెబుతోంది.షాజహాన్ కుమారుడైన ఔరంగజేబు నేతృత్వంలోని మొఘల్ సైన్యం ఓర్చా రాజు జుజార్ సింగ్ పై దాడిచేసింది. అతని పరిధిలో ఉన్న భూమిపై దాడి చేసి 1635లో స్వాధీనం చేసుకుంది.

Read more : 4500 Year Old Sun Temple : ఫారోల దేశంలో బయటపడ్డ 4500 ఏళ్ల నాటి సూర్యదేవాలయం..