Andhrapradesh : ప్రేమ వ్యవహారం, కన్నకూతురినే చంపేశారు
గుంటూరు జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమిస్తుందనే కారణంతో కన్నకూతురిని హత్య చేశారు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా...మృతదేహాన్ని దహనం చేశారు.

Guntur
Andhra Couple Killed Daughter : ప్రేమ వ్యవహారాలు ప్రాణాలు తీస్తున్నాయి. ప్రేమిస్తున్నారనే కారణంతో..చంపేస్తున్నారు. ఇక్కడ కన్న తల్లిదండ్రులే దారుణాలకు తెగబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పరువు పోయిందని కొందరు..ప్రేమ నచ్చలేక ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమిస్తుందనే కారణంతో కన్నకూతురిని హత్య చేశారు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా…మృతదేహాన్ని దహనం చేశారు.
Read More : పట్టాలెక్కనున్న రీజినల్ రింగు రోడ్డు పనులు
గుంటూరు జిల్లా ముట్లూరులో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. కూతురు భవాని ఎవరినో ప్రేమిస్తుందని తల్లిదండ్రులకు తెలిసింది. ప్రేమ వ్యవహారం వద్దని, మానుకోవాలని మందలించారు. దీంతో తల్లిదండ్రులు, కూతురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో…బుధవారం మరోసారి ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో కూతురిని చంపేశారు. గుట్టుచప్పడు కాకుండా…మృతదేహాన్ని దహనం చేశారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు తల్లిదండ్రులను ప్రశ్నించారు. వారి వద్దనుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది. డీఎస్పీ ప్రశాంతి పరిశీలించారు. అసలు భవాని మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పెట్రోల్ పోసి దహనం చేశారని పోలీసులు భావిస్తున్నారు.