ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఉప కులాలకు వర్తించే రిజర్వేషన్లను నిర్వచిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్సు 2025కు సంబంధించి గురువారం గెజిట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఎస్సీ వర్గీకరణ కింద ఉప కులాలకు వర్తించే రిజర్వేషన్ నిబంధనలు, మార్గదర్శకాలు విడుదల చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంటూ ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం, గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్పొరేషన్లు, ఇతర సంస్థల్లో వర్గీకరణ ప్రాతిపదికన రిజర్వేషన్ వర్తిస్తుందని పేర్కొంటూ నోటిఫికేషన్ ఇచ్చింది. విద్యా సంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో బ్యాక్ లాగ్ ఖాళీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తింపు ఉంటుందని స్పష్టం చేసింది.
ముఖ్యాంశాలు ఇవే..