AP Covid : ఫ్లాష్..ఫ్లాష్..ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ప్రస్తుతం రాష్ట్రంలో 10 వేల 119 యాక్టివ్ కేసులుండగా...14 వేల 505 మరణాలు సంభవించాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. విశాఖలో 695, చిత్తూరులో 607 కరోనా

Andhra Pradesh New Covid Cases : ఏపీ రాష్ట్రంలో మళ్లీ కరోనా పడుగ విప్పుతోంది. భారీగా కేసులు నమోదవుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. మొన్నటి వరకు తక్కవగా రికార్డు అయిన కేసులు గత 24 గంటల్లో వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏకంగా 3 వేల 205 కరోనా పాజిటివ్ కేసులున్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 10 వేల 119 యాక్టివ్ కేసులుండగా…14 వేల 505 మరణాలు సంభవించాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. విశాఖలో 695, చిత్తూరులో 607 కరోనా కొత్త కేసులు రికార్డయ్యాయి.

Read More : Leopard Death: కరోనాతో అత్యంత అరుదైన మంచు చిరుత మృతి

20 లక్షల 84 వేల 984 పాజిటివ్ కేసులకు గాను…20 లక్షల 60 వేల 360 మంది డిశ్జార్స్ అయ్యారు. 14 వేల 505 మంది చనిపోయారని, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 10 వేల 119గా ఎంది, జిల్లాల వారిగా కరోనా 41 వేల 954 శాంపిల్స్ పరీక్షించగా…3 వేల 205 మందికి కరోనా సోకగా..ఏ ఒక్కరూ చనిపోలేదని హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 281 మంది పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది.

Read More : Fennel Seed : దాహార్తిని తీర్చే సోంపుగింజల షర్బత్

కేసుల వివరాలు..
అనంతపురం : 160, చిత్తూరు : 607, ఈస్ట్ గోదావరి 274, గుంటూరు : 224, వైఎస్ఆర్ కడప : 42, కృష్ణా : 217, కర్నూలు : 123, నెల్లూరు : 203, ప్రకాశం : 90, శ్రీకాకుళం : 268, విశాఖపట్టణం : 695, విజయనగరం : 212, వెస్ట్ గోదావరి : 90

ట్రెండింగ్ వార్తలు