Fennel Seed : దాహార్తిని తీర్చే సోంపుగింజల షర్బత్

దాహాన్ని తీర్చటంలో సోంపు గింజలతో చాలా మంది షర్బత్ తయారు చేసుకుని తాగుతారు. ముఖ్యంగా వేసవి కాలంలో సోంపు షర్బత్ చేసుకుని తాగటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

Fennel Seed : దాహార్తిని తీర్చే సోంపుగింజల షర్బత్

Fennel Seed Sharbath

Fennel Seed : సుగంధ ద్రవ్యంగా సోంపు మనందరికి సుపరిచితమే.. హోటళ్లలో అల్పాహారం, భోజనం తరువాత సోంప్ ను అందిస్తుంటారు. ఆహారం తిన్నాక దీనిని తీసుకోవటం వల్ల కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది. భోజనం అనంతరం ప్రతిరోజు కనీసం పది గ్రాముల సోంపు తీసుకుంటే జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగుతుంది. ఇందులో అనేక ఔషదగుణాలు ఉన్నాయి.

జీలకర్ర కంటే కొంచెం పెద్దగా ఉండే సోంపులో విటమిన్ సి, కాల్షియం, సోడియం, ఫాస్ఫరస్, ఐరన్, పొటాషియం వంటివి ఉంటాయి. కడుపులో వికారం, గ్యాస్ , కడుపు నొప్పి వంటి సమస్యలకు బాగా ఉపకరిస్తాయి. శరీరంలో పేరుకున్న చెడు కొవ్వును తొలగించేందుకు దోహదపడతాయి. మానసిక ఆందోళన వత్తిడి వంటి వాటిని దూరం చేసే గుణం సోంపులో ఉంది.

అయితే దాహాన్ని తీర్చటంలో సోంపు గింజలతో చాలా మంది షర్బత్ తయారు చేసుకుని తాగుతారు. ముఖ్యంగా వేసవి కాలంలో సోంపు షర్బత్ చేసుకుని తాగటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. జీర్ణక్రియలు సక్రమంగా ఉండేలా ఈ షర్బత్ దోహదం చేస్తుంది. అయితే ఈ సోంపు గింజల షర్బత్ ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం…

కావాల్సిన పదార్ధాలు ; 50 గ్రాముల సోంపు గింజలు, 300 గ్రాముల పటిక బెల్లం, ఒకటిన్నర లీటరు నీళ్ళు, 50 గ్రాముల కోకంపూల్, ఒక టీస్పూన్ కళ్లు ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేయించి పొడి చేసుకొని పెట్టుకోవాలి.

తయారీ విధానం ; 250 ఎమ్ఎల్ నీటిలో సోంపు గింజల్ని ఒక గంటసేపు నానబెట్టాలి. సంగం పటిక బెల్లం 250 ఎమ్.ఎల్ నీళ్ళలో వేసి పూర్తిగా కరగనివ్వాలి. ఇప్పుడు రెండు ద్రవాల్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని సీసాలో పోసి ఫ్రిజ్ లో ఉంచుకోవాలి. 500 ఎమ్.ఎల్ వేడినీటిలో గంటసేపు కోకంఫూల్ నానబెట్టాలి. బ్లెండ్ చేసుకుని చల్లారిన తరువాత ఫ్రిజ్ లో ఉంచిన పానీయంలో కలిపి వేయించిన జీలకర్రపొడి, ఉప్పు కలుపుకోవాలి. దీనికి కొద్దిగా ఐస్ కలుపుకుని చల్లచల్లగా తాగితే మంచిది.