Leopard Death: కరోనాతో అత్యంత అరుదైన మంచు చిరుత మృతి

అమెరికాలోని ఇల్లినాయిస్ లో ఉన్న ప్రముఖ "మిల్లర్ పార్క్ జూ"లో "రైలూ" అనే మంచు చిరుత కరోనా కారణంగా మృతి చెందింది.

Leopard Death: కరోనాతో అత్యంత అరుదైన మంచు చిరుత మృతి

Leopard

Updated On : January 12, 2022 / 4:35 PM IST

Leopard Death: మనుషుల జీవితాలను చిన్నాభిన్నం చేసిన కరోనా మహమ్మారి..జంతువులకూ ప్రాణసంకటంగా మారింది. మనుషుల నుంచి జతువులకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తుండగా.. కరోనా సోకి ఆ జంతువులు మృత్యువాత పడడం తీవ్రతకు అర్ధం పడుతుంది. అమెరికాలోని ఇల్లినాయిస్ లో ఉన్న ప్రముఖ “మిల్లర్ పార్క్ జూ”లో “రైలూ” అనే మంచు చిరుత కరోనా కారణంగా మృతి చెందింది. మనుషుల నుంచి సంక్రమించిన కరోనా వేరియంట్ కారణంగానే రైలూ మృతి చెందినట్లు అక్కడి జంతు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో జూలో ఉన్న మిగతా జంతువులకు తక్షణమే పరీక్షలు జరిపారు అధికారులు. జంతువుల్లోనే అత్యంత అరుదైన మంచు చిరుతలు ఇలా కరోనా భారినపడి మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది.

Also read: Elephants rescued: కాలువలో చిక్కుకున్న ఏనుగుల గుంపు
11 ఏళ్ల రైలూ చిరుత ఎంతో అందంగా ఉండేదని..దాన్ని చూసేందుకు ప్రజలు ఎక్కువగా జూకి వచ్చేవారని జూ సిబ్బంది గుర్తుచేసుకున్నారు. రైలూతో పాటుగా మరికొన్ని మంచు చిరుతల్లో స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు జూ అధికారులు ప్రకటించారు. ప్రతీక్షణం వాటి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు జూలోని వైద్యులు. ఇక నవంబర్ 2021లో నెబ్రాస్కా జూలో మరికొన్ని మంచు చిరుతలు కరోనా భారిన పడగా.. వాటిలో మూడు మంచు చిరుతలు మృత్యువాత పడ్డాయి. ఈఘటన ఒక నెల తరువాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదిలాఉంటె.. మనుషుల నుంచి వైరస్ సోకే అవకాశం పిల్లి, పులి జాతులకు ఎక్కువగా ఉందని.. కావునా అన్ని ప్రాంతాల్లోజు సిబ్బంది తక్షణమే కరోనా వాక్సిన్ వేయించుకోవాలని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ జోయెల్ సార్టోర్ విజ్ఞప్తి చేస్తున్నారు.

Also read: Employee Fitment: ఉద్యోగులకు కనీసం 27 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్న సిపిఐ నేత