Employee Fitment: ఉద్యోగులకు కనీసం 27 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్న సిపిఐ నేత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు

Employee Fitment: ఉద్యోగులకు కనీసం 27 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్న సిపిఐ నేత

Ramakrishna

Employee Fitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ బుధవారం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 23 శాతం ఫిట్మెంట్ ఇస్తూ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సీపీఐ నేత రామకృష్ణ స్పందించారు. గత ప్రభుత్వాల సహాయంలో ప్రకటించిన 10 పీఆర్సీలలో ఇంటీరియం రిలీఫ్ కన్నా ఎన్నడూ ఫిట్మెంట్ తక్కువగా ఇవ్వలేదని రామకృష్ణ తన లేఖలో పేర్కొన్నారు.

Also Read: Bill Gates: ఓమిక్రాన్ రోగనిరోధక శక్తిని పెంచుతుందన్న బిల్ గేట్స్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం.. పీఆర్సీపై చేసిన ప్రకటన ఉద్యోగులను, ఉపాధ్యాయులను తీవ్ర నిరాశకు గురిచేసిందని.. ప్రభుత్వం స్పందించి ఉద్యోగులకు కనీసం 27 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు 2021 అక్టోబర్ నాటికే రెండేళ్లు పూర్తవగా.. తక్షణమే గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేసి, పేస్కేల్ అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తన లేఖలో వివరించారు.

Also Read: Tammareddy Bharadwaj : సినిమా ఇండస్ట్రీలో అందరూ ధైర్యవంతులే..పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు