350 Years Old Well In AP : ప్రకాశం జిల్లా నల్లమల అటవీ గ్రామంలో బయటపడ్డ 350 ఏళ్ల నాటి బావి
చుట్టు చెట్లు..పులులకు ఆవాసంగా ఉండే నల్లమల అడవీ గ్రామంలో ఓ పురాతన బావి బయటపడింది. ఈ బావి నిర్మించిన తీరు అలనాటి ఇంజినీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా కనిపిస్తోంది. ఈనాటి ఆధునిక ఇంజనీరింగ్ ప్రతిభకు ఏమాత్రం తీసి నిర్మాణం ఈ పురాతన బావి సొంతంగాకనిపిస్తోంది. దాదాపు 350 ఏళ్లనాటి ఓ దిగుడుబావి ఆంధ్రప్రదేశ్ లోని మైలచర్ల అనే అటవీ గ్రామంలో బయటపడింది ఈ దిగుడు బావి.

Ancient Well found in Prakasam District
350 years old step well : చుట్టు చెట్లు..పులులకు ఆవాసంగా ఉండే నల్లమల అడవిలోని పురాతన బావి ఒకటి బయటపడింది. ఈ బావి నిర్మించిన తీరు ఇంజినీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా కనిపిస్తోంది. ఈనాటి ఆధునిక ఇంజనీరింగ్ ప్రతిభకు ఏమాత్రం తీసి నిర్మాణం ఈ పురాతన బావి సొంతంగాకనిపిస్తోంది. దాదాపు 350 ఏళ్లనాటి ఓ దిగుడుబావి ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని మైలచర్ల అనే అటవీ గ్రామంలో బయటపడింది ఈ దిగుడు బావి. ఇది మాములు బావి కాదు. ఎవ్వరైనా ఆ బావి కట్టిన వారి ఇంజినీరింగ్ నైపుణ్యానికి ఫిదా అవ్వాల్సిందే.
లేత గోధుమ వర్ణ గ్రానైట్‌తో ఈ బావిని నిర్మించిన ఈ బావి నిర్మాణం చూసిన పురావస్తు శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. ఈ బావి నిర్మాణం నాటి భారతీయ ఇంజినీరింగ్ నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. పైనుంచి మట్టి పెళ్లలు విరిగిపడ్డా బావిలో ఉండే నీరు కలుషితం కాకుండా రాళ్లను పొందికగా పేర్చి మెట్లను నిర్మించారు ఈ బావిని. ఎంత నీటి ఎధ్దడి వచ్చినా ఈ బావిలో నీరు ఊరుతునే ఉంటుందట.అంతేకాదు 350 ఏళ్లనాడు నిర్మించిన ఈ బావి నీరు రుచిలో మాత్రం ఏమాత్రం పాడవ్వలేదు. చక్కటి రుచితో నీరు ఉండటం విశేషం.
ఈ బావి నిర్మాణంలోనే కాదు దీని చరిత్ర కూడా చాలా గొప్పదనే చెప్పాలి. భైరవకోన గుహాలయాల్లో క్రీ.శ 1675 ప్రాంతంలో నివసించిన ఒక సాధువు దీనిని నిర్మించాలని సూచించినట్లు చెప్తారు అక్కడి స్థానికులు. ఆ ప్రాంత ప్రజల తాగునీటి సమస్యలను చూసి.. చలించిపోయిన స్వామీజీ వారి నీటి కష్టాలు తీర్చాలని అనుకున్నారట. మైలచర్ల సమీపంలో ఓ నీటి ఊట దగ్గర ఒక దిగుడు బావిని నిర్మించాలని తన శిష్యులైన గండి సోదరులను ఆదేశించారట. ఆయన మాటలను దైవవాక్కుగా భావించిన గండి సోదరులు అప్పట్లో ఈ బావిని నిర్మించారని చెబుతున్నాను స్థానికులు. 350 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజల నీటి సమస్యను తీరుస్తున్న ఈ బావి గురించి స్థానికులకు తప్ప బయటవారికి పెద్దగా తెలియదు.ఇటీవలే ఈ బావి గురించి తెలుసుకుంది తెనాలికి చెందిన పురావస్తు పరిశోధక బృందం.
ఎంత భారీ వర్షం వచ్చినా కూడా మట్టి, బురదనీరు ఈ బావిలోకి చేరకుండా దీనిని డిజైన్ చేశారు. ఈ భావిలోని నీరు తియ్యగా ఉంటుందని..ఎంత కరవు వచ్చినా కూడా.. బావి లో నీరు మాత్రం తగ్గదని స్థానికులు చెబుతున్నారు. సరైన రోడ్డు మార్గం లేక ఈ దిగుడు బావి విలువ బయటి ప్రపంచానికి తెలియట్లేదని చెప్తున్నారు ఇక్కడి జనం. ఇటువంటి కట్టడాలను సంరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.