Andhra Pradesh : కరోనా..24 గంటల్లో 6 వేల 952 కేసులు

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 6 వేల 952 మందికి కరోనా సోకింది. 58 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

Andhra Pradesh New Covid Cases : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 6 వేల 952 మందికి కరోనా సోకింది. 58 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

91 వేల 471 యాక్టివ్ కేసులు ఉండగా..11 వేల 882 మంది చనిపోయారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 11 మంది కరోనాతో మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 1199 కరోనా కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం 18,00,179 పాజిటివ్ కేసులకు గాను 16,96,880 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 91,417గా ఉంది.

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారు :-
ప్రకాశంలో 11 మంది, చిత్తూరులో తొమ్మది మంది, తూర్పు గోదావరిలో ఆరుగురు, అనంతపూర లో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, విశాఖపట్టణంలో ఐదుగురు, శ్రీకాకుళంలో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, కర్నూలులో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, వైఎస్ఆర్ కడపలో ఒక్కరు, నెల్లూరులో ఒక్కరు చనిపోయారు.

జిల్లాల వారీగా కేసులు :-
అనంతపురం 550. చిత్తూరు 1199. ఈస్ట్ గోదావరి 1167. గుంటూరు 426. వైఎస్ఆర్ కడప 456. కృష్ణా 392. కర్నూలు 251. నెల్లూరు 228. ప్రకాశం 552. శ్రీకాకుళం 383. విశాఖపట్టణం 436. విజయనగరం 249. వెస్ట్ గోదావరి 663. మొత్తం : 6,952

Read More : GST Council : బ్లాక్ ఫంగస్ మెడిసిన్‌‌పై నో ట్యాక్స్..కొవిడ్ వ్యాక్సిన్లపై 5 శాతం జీఎస్టీ..

ట్రెండింగ్ వార్తలు