Pregnant Delivery in Train : దురంతో ఎక్స్‌ప్రెస్‌లో గర్భిణికి పురిటి నొప్పులు .. ఒట్టి చేతులతో సాధారణ ప్రసవం చేసిన డాక్టర్

దురంతో ఎక్స్‌ప్రెస్‌లో గర్భిణికి పురిటి నొప్పులు రావటంతో అదే రైలులో ప్రయాణించే ఓ డాక్టర్ ఎటువంటి పరికరాలు లేకుండా ఒట్టి చేతులతో సాధారణ ప్రసవం చేశారు. తల్లీ బిడ్డల ప్రాణాలు కాపాడారు.

doctor who gave birth to a pregnant woman in  train : అది విజయవాడ నుంచి విశాఖపట్నం వేగంగా దూసుకెళుతున్న దురంతో ఎక్స్‌ప్రెస్. ఆ రైలులో ఓగర్భిణి తన భర్తతో కలిసి ప్రయాణం చేస్తోంది. అర్థరాత్రి అయ్యింది. సడెన్ గా ఆమెకు ప్రసవం నొప్పులు వచ్చాయి. ఏం చేయాలో తెలియలేదు. ఆమె భర్త కంగారుపడిపోయాడు ఏం చేయాలో పాలుపోక. కానీ ఆ రైలులో ఓ మహిళా డాక్టర్ ప్రయాణిస్తోంది. ఆ విషయం వారికి తెలియదు. కానీ డాక్టర్ అయినా ప్రసవం చేయాలంటే కనీస పరికరాలైనా ఉండాలిగా..అవేమీ లేవు. అయినా ఆ లేడీ డాక్టర్ అంత్యం చాక చక్యంగా గర్భిణికి పురుడు పోసి పండంటి బిడ్డను ఆ భార్యభర్తల చేతుల్లో పెట్టటం వారి ఆనందం అంతా ఇంతా కాదు. అలా తల్లీ బిడ్డలకు కాపాడిన ఆ లేడీ డాక్టర్ పై ప్రసంశల వర్షం కురిసింది.

విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రె్‌సలో మంగళవారం (సెప్టెంబర్ 13,2022) తెల్లవారుజామున ప్రసవం నొప్పులు వచ్చిన గర్భిణికి పురుడు పోశారు గీతం మెడికల్‌ కాలేజీకి చెందిన హౌస్‌ సర్జన్‌ స్వాతిరెడ్డి కేసరి. డాక్టర్ స్వాతిరెడ్డి సోమవారం రాత్రి విజయవాడలో దురంతో ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి విశాఖపట్నం బయల్దేరారు. ఆమె ఎక్కిన బి6 కంపార్టుమెంట్‌లోనే శ్రీకాకుళానికి చెందిన సత్యవతికి ఉన్నట్లుండి నొప్పులు వచ్చాయి. కానీ ప్రసవానికి ఇంకా నాలుగు వారాలు సమయం ఉందని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆమె ప్రసవం కోసం పుట్టింటికి దురంతో ఎక్స్ ప్రెస్ లో బయలుదేరింది. కానీ ప్రయాణంలో నొప్పులు రావటంతో సత్యవతి బెంబేలు పడిపోయింది. ఆమె భర్త కంగారు అంతా ఇంతా కాదు.

ప్రయాణంలో ఉన్న సత్యవతికి తెల్లవారుజామున 3.35 గంటలకు ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. మరో స్టేషన్‌ వచ్చేవరకు ఆస్పత్రికి వెళ్లే అవకాశం లేదు. దీంతో ఆమె భర్తలో కంగారుపడుతూ ..ఎవరైనా మహిళలకు అడుగుదామని అనుకున్నాడు. అలా డాక్టర్ స్వాతిరెడ్డి బెర్త్‌ వద్దకు వచ్చి ఆమెను నిద్రలేపారు. ఆమె డాక్టర్ అని అతనికి తెలియదు. నా భార్యకు నొప్పులు వస్తున్నాయి దయచేసి సహాయం చేయండి ప్లీజ్ అంటూ కోరాడు.దీంతో స్వాతిరెడ్డి భయపడకండీ నేను డాక్టర్నే అని చెప్పి ప్రసవం చేయటానికి సిద్ధపడ్డారు. బెడ్‌ షీట్‌ను అడ్డంగా పెట్టి అలా ఎటువంటి పరికరాలు లేకుండా అత్యంత చాకచక్యంగా కేవలం 15 నిమిషాల్లోనే నార్మల్‌ డెలివరీ చేశారు.అప్పటికే పక్క స్టేషన్ లో 108 వాహనానికి సమాచారం అందించారు.

అలా తెల్లవారుజామును 5.30 గంటలకు రైలు అనకాపల్లి చేరడంతో స్వాతిరెడ్డి వారిని.. అప్పటికే సిద్ధంగా ఉన్న 108 వాహనంలో ఎన్‌టీఆర్‌ ఆస్పత్రికి తరలించి.. తదుపరి వైద్యం అందించారు. పురుడు పోసి తల్లీబిడ్డలను కాపాడిన స్వాతిరెడ్డికి సత్యవతి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. గీతం కాలేజీ యాజమాన్యం కూడా డాక్టర్ స్వాతిరెడ్డిని అభినందించింది. అనుకోకుండా రైలులో చేసిన ప్రసవం గురించి డాక్టర్ స్వాతిరెడ్డి మాట్లాడుతూ.. ఇదో అద్భుతమైన అనుభవంగా అనిపించిందని..తాను ఇప్పటిదాకా నా తోటి డాక్టర్లు..వైద్య సిబ్బంది సహాయంతో డెలివరీలు చేశాను..కానీ మొదటిసారి ఒంటరిగా.. కనీసం ఎటువంటి పరికరాలు లేకుండా చేసిన మొదటి డెలివరీ చేశానని ఈ అనుభవాన్ని తన జీవితంలో మరిచిపోలేనని అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు