Rs.2 crore Diamond In Andhra Pradesh : కర్నూలు జిల్లా ఎర్రగుడిలో రైతుకు దొరికిన రూ.2 కోట్ల విలువైన వజ్రం..

వర్షాలు కురిస్తే పంటలు పండుతాయని రైతులు ఆశిస్తారు. కానీ ఇటీవల ఏపీలో కురిసిన వర్షాలకు కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతుకు వజ్రం పంట పండింది. పొలం పనులు చేస్తుండగా రూ.2 కోట్ల విలువైన వజ్రం దొరికింది.

Diamond worth Rs 2 crore is available in Andhra Pradesh : వర్షాలు కురిస్తే పంటలు పండుతాయని రైతులు ఆశిస్తారు. కానీ ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఏపీలోని కర్నూలు జిల్లాలో ఓ రైతుకు వజ్రాలు పండాయి.వజ్రాలేంటీ పండటమేంటీ?అనుకుంటున్నారా? నిజమే మరి..కానీ పండటం అంటే పంట పండటం కాదు. అదృష్టం పండి ఓ రైతుకు ఓ విలువైన వజ్రం దొరకింది. దీంతో ఆ రైతుకు..ఆ రైతు కుటుంబం అంతా ఆనందంలో మునిగిపోయింది. కర్నూలు జిల్లాలో వర్షాకాలంలో వజ్రాలు దొరుకుతాయనే విషయం తెలిసిందే. ఈక్రమంలో ఓ రైతుకు అదృష్టం వరించి ఓ విలువైన వజ్రం దొరికింది. ఈవజ్రం విలువ ఓపెన్ మార్కెట్ లో ఏకంగా రెండు కోట్ల రూపాయలు పలుకుతుంది అని నిపుణులు తెలిపారు. ఈ వర్షాకాలంలో ఇంత విలువైన వజ్రం దొరకటం ఇదేనట..

కర్నూలు జిల్లాలోని జి.ఎర్రగుడి గ్రామానికి చెందిన ఓ రైతు పొలం పనులు చేస్తుండగా..ఓ వజ్రం దొరికింది. 10 క్యారెట్ల బరువైన వజ్రం లభించింది. విషయం తెలుసుకున్న పెరవలి, జొన్నగిరి ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యాపారులు రైతును సంప్రదించారు. వ్యాపారులు అంతా కలిసి మీడియేట్ ద్వారా రైతును సంప్రదించి అతి రహస్యంగా రెండు కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాన్ని కేవలం రూ.50లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఏటా తొలకరి వర్షాల తర్వాత జొన్నగిరి, పగిడిరాయి, జి.ఎర్రగుడి, తుగ్గలి ప్రాంతాల్లోని పొలాల్లో వజ్రాలు లభించడం సాధారణమేనని స్థానికులు చెబుతున్నారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు