AP Assembly Session: ఏపీ అసెంబ్లీలో గందరగోళం.. టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్.. బాలకృష్ణకు స్పీకర్ వార్నింగ్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ పై చర్చించాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.

AP Assembly Session

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు అరెస్టుపై అసెంబ్లీలో చర్చించాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది..

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 21 Sep 2023 12:06 PM (IST)

    27వరకు శాసన సభ సమావేశాలు ..

    ఏపీ అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం.

    బీఏసీ సమావేశానికి హాజరైన సీఎం జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన, ప్రభుత్వ చీఫ్‌విప్ ప్రసాద్ రాజు.

    బీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ.

    ఐదు రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం.

    27 వరకు శాసన సభ సమావేశాలు.

    శని, ఆదివారం శాసన సభకు సెలవు.

    రేపు శాసన సభలో స్కిల్ డవలెప్మెంట్ స్కామ్ పై చర్చించే అవకాశం.

  • 21 Sep 2023 12:03 PM (IST)

    బీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ. బీఏసీ సమావేశానికి రాబోమని తేల్చిచెప్పిన టీడీపీ నేతలు.

    అసెంబ్లీలో ఏ అంశం చర్చకు రావాలన్నా బీఏసీ సమావేశానికి రావాల్సిందేనని చెప్పిన ప్రభుత్వం.

    కాసేపట్లో స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరగనున్న బీఏసీ సమావేశం.

    స్పీకర్ ఛాంబర్ ఎదుట ఆందోళన కొనసాగిస్తున్న టీడీపీ సభ్యులు.

  • 21 Sep 2023 11:50 AM (IST)

    కాసేపట్లో బీఏసీ సమావేశం.. బీఏసీ సమావేశానికి వెళ్లకూడదని టీడీపీ నిర్ణయం

  • 21 Sep 2023 11:43 AM (IST)

    14 మంది టీడీపీ ఎమ్మెల్యేలపై ఒకరోజు సస్పెన్షన్ వేటు.

    పయ్యావుల కేశవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌పై అసెంబ్లీ సెషన్స్ పూర్తయ్యే వరకు సస్పెన్షన్

  • 21 Sep 2023 11:30 AM (IST)

    బాలయ్యకు స్పీకర్ వార్నింగ్ ..

    సభలో మీసాలు తిప్పడం సరికాదు, సభా సంప్రదాయాలను ఉల్లంఘించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవంటూ బాలకృష్ణ కు స్పీకర్  తమ్మినేని వార్నింగ్ ఇచ్చారు.

  • 21 Sep 2023 11:26 AM (IST)

    అసెంబ్లీ నుంచి బాలకృష్ణ సస్పెన్షన్ ..

    సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారని టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, అనగాని సత్యప్రసాద్ సహా 14 మంది టీడీపీ సభ్యులను (కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహా) సస్పెండ్ చేశారు.

    కాగా ఓ టీడీపీ సభ్యుడు సెల్ ఫోన్తో సమావేశాలను చిత్రీకరించడంతో.. సభలో వీడియోగ్రఫీ అనుమతి లేదని మంత్రి అమర్నాథ్, రోజా అభ్యంతరం తెలిపారు. దీంతో ఆ సభ్యుడిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • 21 Sep 2023 11:23 AM (IST)

    చంద్రబాబు అరెస్టుపై చర్చించాలంటూ టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్ తమ్మినేని

  • 21 Sep 2023 11:15 AM (IST)

    అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు శ్రీధర్ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగానే సత్యప్రసాద్ పై సస్పెన్షన్ వేటు వేసిన స్పీకర్ తమ్మినేని

  • 21 Sep 2023 11:13 AM (IST)

    వాయిదా అనంతరం తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

  • 21 Sep 2023 10:53 AM (IST)

    పేర్ని నాని - బుచ్చయ్య చౌదరి మధ్య చిట్ చాట్

    అసెంబ్లీ లాబీల్లో పేర్ని నాని - బుచ్చయ్య చౌదరి మధ్య చిట్ చాట్.

    నాని-బుచ్చయ్య మధ్య ముందస్తు ముచ్చట్లు.

    ప్రస్తుతం కేంద్రం వ్యవహరిస్తోన్న తీరు చూస్తోంటే ఈ సెషన్సే చివరి సెషన్సులా ఉన్నాయన్న బుచ్చయ్య.

    డిసెంబర్ నెలలో ఎన్నికలు వస్తాయేమోనన్న బుచ్చయ్య.

    అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయ్యాకే ఎన్నికలు ఉంటాయోమోనన్న పేర్ని నాని.

  • 21 Sep 2023 10:34 AM (IST)

    ఏపీ శాసన మండలిలోనూ గందరగోళ పరిస్థితి నెలకొంది. చంద్రబాబు అరెస్టుపై చర్చకు టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా.. మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో చైర్మన్ సభను వాయిదా వేశారు.

  • 21 Sep 2023 10:24 AM (IST)

    కోటంరెడ్డి టార్గెట్‌గా వైసీపీ సభ్యులు రెచ్చిపోయారు.. పయ్యావుల

    అసెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవులు చిట్ చాట్ లో మాట్లాడుతూ.. సభలో వైసీపీ సభ్యులు మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మేం వాళ్ల ట్రాప్‌లో పడలేదు. సభలో హక్కులకోసం మా పోరాటం కొనసాగుతోంది. కోటంరెడ్డిని టార్గెట్ చేసేలా వైసీపీ సభ్యులు సభలో వ్యవహరించారు. చంద్రబాబు అరెస్టు అక్రమం అనే అంశ పైనే మా పోరాటం సాగుతుంది.

  • 21 Sep 2023 10:13 AM (IST)

    సభ పది నిమిషాలు వాయిదా అనంతరం.. టీడీఎల్పీలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం అయ్యారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై చర్చిస్తున్నారు.

  • 21 Sep 2023 10:06 AM (IST)

    అంబటి వర్సెస్ బాలకృష్ణ..

    చంద్రబాబు అరెస్టుపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబడుతూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. స్పీకర్ పైకి పేపర్లు విసురుతూ నిరసన తెలిపారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు కొట్టివేయాలని నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనతో సభలో అవాంఛనీయ ఘటనలు జరిగే ప్రమాదం ఉందని మంత్రి అంబటి మాట్లాడుతున్న క్రమంలో.. రండి చూసుకుందాం అంటూ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేతితో సైగలు చేయడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.

    బాలకృష్ణ మీసాలు తిప్పుతూ రెచ్చగొడుతున్నారంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీసాలు సినిమాలో తిప్పు.. ఇక్కడ కాదు అంటూ బాలకృష్ణకు సూచించారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సభలో తొడ కొట్టారు. బాలకృష్ణకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. దీంతో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం తీవ్రం కావడంతో సభను పది నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

  • 21 Sep 2023 09:55 AM (IST)

  • 21 Sep 2023 09:51 AM (IST)

    అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీఎల్పీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి టీడీపీ సభ్యులతో కలిసి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లారు.

  • 21 Sep 2023 09:46 AM (IST)

    టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగడంతో సభను పది నిమిషాలు వాయిదా వేశారు.

  • 21 Sep 2023 09:45 AM (IST)

    చంద్రబాబు అరెస్టుపై చర్చకు సిద్ధం : బుగ్గన

    చంద్రబాబు అరెస్ట్ పై సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. టీడీపీ సభ్యుల నిరసనపై అసహనం వ్యక్తం చేసిన ఆయన.. వారు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతామన్నారు. కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకే టీడీపీ ఆందోళన చేస్తోందని బుగ్గన మండిపడ్డారు.

  • 21 Sep 2023 09:43 AM (IST)

    టీడీపీ సభ్యులు శాంతియుతంగా నిరసన తెలపాలని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. అయినా టీడీపీ సభ్యులు తమ నినాదాలతో సభను హోరెత్తిస్తున్నారు.

  • 21 Sep 2023 09:42 AM (IST)

    ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియాన్ని ముట్టడించారు. దీంతో టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • 21 Sep 2023 09:40 AM (IST)

    ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు అరెస్ట్ పై చర్చించాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.

  • 21 Sep 2023 09:38 AM (IST)

    ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే గందరగోళ పరిస్థితి నెలకొంది.