AP Cabinet Meeting : రేపు ఏపీ మంత్రివర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం గురువారం సమావేశం అవుతోంది. ప్రస్తుతం ఉన్న మంత్రులకు ఇదే ఆఖరి కేబినెట్ మీటింగ్. ఈ భేటీ చాలా ఆసక్తి కలిగిస్తోంది.

AP Cabinet Meeting :  ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం గురువారం సమావేశం అవుతోంది. ప్రస్తుతం ఉన్న మంత్రులకు ఇదే ఆఖరి కేబినెట్ మీటింగ్. ఈ భేటీ చాలా ఆసక్తి కలిగిస్తోంది…సాధారణంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల కోసం కేబినెట్ భేటీ జరుగుతుంది. కానీ రేపు మంత్రుల రాజీనామాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

రెండున్నరేళ్లకే మంత్రి పదవి…ఈ విషయం ఏపీ సీఎం జగన్ ముందే చెప్పారు..అయినా కొంతమంది మంత్రుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. రేపు జరిగే కేబినెట్ మీటింగ్ లో ఒకటో రెండో నిర్ణయాలు తప్ప మిగిలినది అంతా కేబినెట్ విస్తరణకు సంబంధించిన చర్చ జరుగుతుందని తెలుస్తోంది.  కేబినెట్ మీటింగ్ లో మంత్రులు రాజీనామాలు చేస్తారా లేదా అనే చర్చ జరుగుతోంది.

ఒకవేళ రాజీనామాలు చేస్తే గవర్నర్‌కు పంపాలి… ఆయన ఆమోదం పొందాలి….దీంతో సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.  గురువారం జరిగే కేబినెట్ మీటింగ్‌లో సీఎం కొత్త మంత్రుల వివరాలు చెప్పే అవకాశం ఉంది.  అదే విధంగా ఇప్పుడున్న మంత్రులకు అప్పగించే బాధ్యతలు కూడా వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read : Purandeswari On NTR District : ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటుపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
వీటితో పాటు ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు, కొత్తపేట రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు ఇన్నాళ్లు విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి ఏరియాలో నివాసం ఉంటున్న కొందరు మంత్రులు  ఇవాళ వారి నివాస గృహాలలోని సామాన్లను స్వస్ధలాలకు తరలించారు.

ట్రెండింగ్ వార్తలు