Purandeswari On NTR District : ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటుపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటును బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి స్వాగతించారు.

Purandeswari On NTR District : ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటుపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

Purandeswari On Ntr District

Purandeswari On NTR District : విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటును బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి స్వాగతించారు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో పాటు అభిమానులు ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్ ఇప్పటికి నెరవేరిందన్నారు. కొత్త జిల్లాపై ఎన్టీఆర్ కుటుంబసభ్యులు మాట్లాడనంత మాత్రాన వ్యతిరేకించినట్లు కాదన్నారు పురంధేశ్వరి. విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేయడం మంచి పరిణామం అని ఆమె అన్నారు.

పాలకపక్షాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని విస్మరించాయని పురంధేశ్వరి విమర్శించారు. రాష్ట్రాన్ని పాలించిన వారిలో ఎక్కువమంది రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు అయినా ఈ ప్రాంతానికి మేలు జరగలేదన్నారు. రేపటి నుంచి ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టులను బీజేపీ బృందాలు సందర్శించి ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తాయన్నారు.(Purandeswari On NTR District)

ఆంధ్రప్రదేశ్‌లో నవశకానికి నాంది పలికింది జగన్ సర్కార్. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఉన్న 13 జిల్లాలకు తోడు కొత్తగా మరో 13 జిల్లాలు ఏర్పాటయ్యాయి. మొత్తం 26 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్‌ కొత్త రూపు దిద్దుకుంది.

AP New Districts : ఏపీలో మొత్తం జిల్లాలు 26, రెవెన్యూ డివిజన్లు 73, పూర్తి వివరాలు

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కొత్త జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ (ఎల్‌జీడీ) కోడ్‌లు కేటాయించింది. పార్వతీపురం మన్యం జిల్లాకు 743, అనకాపల్లికి 744, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 745, కాకినాడకు 746, కోనసీమకు 747, ఏలూరుకు 748, ఎన్టీఆర్ జిల్లాకు 749, బాపట్లకు 750, పల్నాడుకు 751, తిరుపతికి 752, అన్నమయ్య జిల్లాకు 753, శ్రీ సత్యసాయి జిల్లాకు 754, నంద్యాలకు 755 కోడ్‌లను కేటాయించింది. రాష్ట్రాలతో కేంద్రం జరిపే పాలనాపరమైన సంప్రదింపులు, వివిధ పథకాలకు సంబంధించి జిల్లాల వారీగా కేటాయింపులు తదితర అంశాల్లో వీటిని వినియోగిస్తారు.

ఇక కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైంది. కొత్త 13 జిల్లాల్లో అధికారులు, ఉద్యోగులు బాధ్యతలు చేపట్టారు. ఏపీలో గతంలో ఉన్న 13 జిల్లాలకు తోడు కొత్తగా మరో 13 చేరి ఆ సంఖ్య 26కు పెరిగింది. అలాగే కొత్తగా మరో 22(పాతవి 51) రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయగా.. మొత్తం 73 డివిజన్లు అయ్యాయి. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను కూడా పరిగణలోకి తీసుకుంది. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంది. అయితే ఈ 26 జిల్లాలకు తోడు కొత్తగా మరో జిల్లా ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

ఏజెన్సీ ప్రాంతమైన తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం.. పోలవరం ముంపు ప్రాంతాలతో కలిపి మరో జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు గిరిజన జిల్లాలు ఉండగా.. కొత్తగా మరొకటి ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

Laxmi parvathi: ఎన్టీఆర్ పేరు శాశ్వతంగా నిలిచేలా చంద్రబాబు ఒక్క పనిచేయలేదు.. జగన్ చేసి చూపించారు

కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఆర్డీవో, మిగిలిన డివిజన్‌ స్థాయి అధికారుల పరిధులు తగ్గిపోయాయి. అధిక జనాభా, మండలాలు కలిగిన జిల్లాల్లో నెల్లూరు జిల్లా తొలి స్థానంలో ఉంది. ప్రకాశం జిల్లా రెండో స్థానంలో నిలిచింది. జనాభా పరంగా చూస్తే.. నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, ఎన్టీఆర్‌ జిల్లాలు ముందు ఉన్నాయి.

సమగ్రాభివృద్ధి, సమానాభివృద్ధి, సర్వజనాభివృద్ధి, సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా పాలన వికేంద్రీకరణ చేపట్టినట్లు సీఎం జగన్ తెలిపారు. అభివృద్ధి ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకూడదని, పాలన సామాన్య ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు చేరువగా ఉండాలని, అభివృద్ధి ఫలాలు అందరికీ పారదర్శకంగా ఇంకా మెరుగ్గా అందాలన్న సమున్నత లక్ష్యంతో నవశకానికి నాంది పలికాం అన్నారు.