కోవిడ్ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు, కోవిడ్ పరిస్థితి తదితర వివరాలను ఆయన వెల్లడించారు.
పొరుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుగా మహా నగరాలు లేవని, ఆ నగరాల్లో ఉన్నట్టుగా భారీ మౌలికసదుపాయాలు ఉన్న ఆస్పత్రులూ లేవన్నారు. రాష్ట్రంలో వైద్య సదుపాయాలను గణనీయంగా మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
25 లక్షలకు పైగా పరీక్షలు
మొత్తం రాష్ట్రంలో ఇప్పటి వరకు 25 లక్షలకు పైగా పరీక్షలు చేశామని, ప్రతి పది లక్షల మందికి 47,459 మందికి పరీక్షలు చేసినట్లు, మరణాలు రేటు 0.89శాతం గా ఉందన్నారు. క్లస్టర్లలోనే 85 శాతం నుంచి 90శాతం వరకూ పరీక్షలు చేస్తున్నట్లు, సాధ్యమైనంత త్వరగా పాజిటివ్ కేసులను గుర్తిస్తున్నామన్నారు.
ఐసోలేషన్ చేస్తున్నాం
ఇలా చేయడం వల్ల మరణాలను అదుపులో ఉంచే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. వైద్య సదుపాయం అందించడమే కాకుండా, ఐసోలేషన్ చేస్తున్నామన్నారు. కోవిడ్ వచ్చే నాటికి వైరాలజీ ల్యాబ్ కూడా లేదనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
పది లక్షల మందికి 47 వేలకు పైగా పరీక్షలు
ఇప్పుడు ప్రతి పది లక్షల మందికి 47 వేలకు పైగా పరీక్షలు
చేస్తున్నామని, ప్రతి జిల్లాల్లో ల్యాబ్‌లు, టెస్టుల విషయంలో స్వాలంబన సాధించామన్నారు. దాదాపు 2 లక్షలమంది వాలంటీర్లు క్షేత్రస్థాయిలో కోవిడ్ నివారణా చర్యల్లో పాల్గొంటున్నట్లు, అవసరమైన వారికి అందరికీ టెస్టులు చేస్తున్నామన్నారు.
ఇంకా ఏమన్నారంటే..
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న హోంమంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.