మోడీపై చంద్రబాబు ఆగ్రహం: ప్రజాస్వామ్యంను నాశనం చేస్తున్నారు

  • Publish Date - April 30, 2019 / 02:25 AM IST

పశ్చిమ బెంగాల్‌లో అధికార 40 మంది తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాగానే టీఎంసీ నుంచి వీరంతా బయటకొస్తారని మోడీ అనడం ప్రజాస్వామ్య విరుద్ధం అని చంద్రబాబు మండిపడ్డారు.

ప్రజాస్వామ్య స్ఫూర్తికి మోడీ తీరని ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘రాజ్యాంగబద్ధ వ్యవస్థలను ఇప్పటికే నాశనం చేసిన ప్రధాని మోడీ, ఇప్పుడు ప్రజాస్వామ్యంను కూడా నాశనం చేయాలని చూస్తున్నారని, ఇదే విషయాన్ని మేము ఎప్పటి నుంచో చెబుతున్నామని, మోడీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అని చంద్రబాబు అన్నారు.

ఓవైపు ఎన్నికల ప్రక్రియ జరుగుతుంటే.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను కొనాలని మోడీ గట్టిగా ట్రై చేస్తున్నారని, మోడీ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం స్పందించి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.