Andhra Pradesh : ఏపీలో తగ్గిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. శనివారం 1145 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.

Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 49,581 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,145 మందికి కరోనా నిర్దారణ అయింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో 20,28,785 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనాతో 17 మంది మృతి చెందారు.

Read More : ‘Manike Mage Hithe‘ పాటకు ఇండిగో ఎయిర్‌ హోస్టెస్‌ స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా!

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,967కి చేరింది. నిన్న 1,090 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,99,651కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,157 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,72,79,362 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా కేసులు

అనంతపురం -18, చిత్తూరు – 132 తూర్పు గోదావరి – 216 గుంటూరు – 85 కడప – 111, కృష్ణా – 128, కర్నూలు – 6, నెల్లూరు – 173, ప్రకాశం – 117, శ్రీకాకుళం – 12, విజయనగరం – 7, విశాఖపట్నం – 62, పశ్చిమ గోదావరి – 78 కేసులు నమోదయ్యాయి

Read More : Big Day : మరో ప్రాణం నిలబడింది..బిగ్ డే అన్న సోనూ సూద్

మృతులు

చిత్తూరు – నలుగురు, కడప – ముగ్గురు, నెల్లూరు – ముగ్గురు, కృష్ణా – ఇద్దరు, ప్రకాశం – ఇద్దరు, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం ఒక్కరు చొప్పున మృతి చెందారు.

ట్రెండింగ్ వార్తలు