‘Manike Mage Hithe‘ పాటకు ఇండిగో ఎయిర్‌ హోస్టెస్‌ స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా!

శ్రీలంక సింగర్ యోహాని దిలోకా ది సిల్వా పాడిన పాట ‘మాణికే మాగే హితే’ పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇండిగో ఎయిర్ హోస్టెస్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

‘Manike Mage Hithe‘ పాటకు ఇండిగో ఎయిర్‌ హోస్టెస్‌ స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా!

Indigo Air Hostess Dances To Manike Mage Hithe On Empty Flight (1)

Manike Mage Hithe Song : శ్రీలంక సింగర్ యోహాని దిలోకా ది సిల్వా పాడిన పాట ‘మాణికే మాగే హితే’ పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ పాటకు నెటిజన్లు తమ వీడియోలు, రీల్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా ఈ పాటను యాడ్ చేస్తున్నారు. ప్రత్యేకించి ఇన్ స్టాగ్రామ్ లో మాణికే మాగే హితే పాట సూపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు పాటకు ఇండిగో ఎయిర్ హోస్టెస్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ఇప్పటివరకూ 13 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చేశాయి. ఖాళీగా ఉన్న విమానంలో ఎయిర్ హోస్టెస్ Aayat Urf Afreen తన యూనిఫాంలో మాణికే మాగే హితే పాటకు స్టెప్టులతో అదరగొట్టేసింది. తాను డ్యాన్స్ వేస్తుంటే తోటి సిబ్బంది ఈ వీడియోను రికార్డు చేశారు.
Ashu Reddy : ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వూ.. అషు రెడ్డి వాళ్ల అమ్మ ఏం చెప్పిందంటే..

పాటకు తగినట్టుగా తన హవాభావాలను పలికిస్తూ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. మాణికే మాగే హితే అనే పాట ఒరిజినల్ సాంగ్ శ్రీలంకలో సింహళి భాషలోనిది. ఈ పాట పాడిన సింగర్ గాత్రం ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పలు భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఇప్పుడు ఈ పాట అందరిని ఆకర్షిస్తోంది. పాటకు ఎయిర్ హోస్టెస్ డ్యాన్స్ మరింత అందాన్ని ఇచ్చింది. ఇన్ స్టాలో క్యూట్ స్టెప్పులతో ఆమె వేస్తున్న స్టెప్పులను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ‘మాణికే మాగే హితే’ పాటకు తగినట్టుగా ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ సెట్‌ అయ్యాయని కామెంట్లు చేస్తున్నారు.

పాటకు మీ ఆట బాగా సింక్‌ అయిందని మెచ్చుకుంటున్నారు. క్యూట్‌గా డ్యాన్స్‌ చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు. మాణికే మాగే హితే అనేది సతీషన్ రత్నాయక రాసిన 2020 సింహళ పాట. యోహనీ వెర్షన్ మే నెలలో రిలీజ్ అయిన తర్వాత ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. దులన్ ARX ద్వారా సాహిత్యాన్ని అందించారు. యోహనీ మణికే మాగే హితే 3 నెలల్లోనే యూట్యూబ్‌లో 91 మిలియన్ వ్యూస్‌ని అధిగమించి రాత్రికి రాత్రే పాపులర్ అయింది. అయితే ఎయిర్ హోస్టెస్ అయత్ ఉర్ఫ్ అఫ్రీన్ కు ఇన్‌స్టాగ్రామ్‌లో 56,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
Viral Duck : ‘యూ బ్లడీ ఫూల్’ అని తిడుతున్న బాతు