Ap Corona Update (2)
AP Corona Update : శనివారం ఏపీలో కరోనా కేసులు పెరిగాయి. గత 24 గంటల వ్యవధిలో 2,174 మందికి కరోనా సోకింది. 18 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 22 వేల 358 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం 13 వేల 241 మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 2 వేల 737 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. కృష్ణా జిల్లాలో ఐదుగురు, చిత్తూరు జిల్లాలో నలుగురు కరోనాతో చనిపోయారు.
ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే :-
కృష్ణా జిల్లాలో ఐదుగురు, చిత్తూరులో నలుగురు , తూర్పుగోదావరి, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు చొప్పున.. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో ఒక్కరు చొప్పున మృతి చెందారు.
జిల్లాల వారీగా కేసులు
అనంతపురం 67. చిత్తూరు 329. ఈస్ట్ గోదావరి 418. గుంటూరు 132. వైఎస్ఆర్ కడప 89. కృష్ణా 248. కర్నూలు 08. నెల్లూరు 246. ప్రకాశం 233. శ్రీకాకుళం 63. విశాఖపట్టణం 103. విజయనగరం 29. వెస్ట్ గోదావరి 209. మొత్తం : 2,174