CPI Ramakrishna : కేంద్రంలో మోదీని గద్దె దించాలి.. ఏపీలో జగన్‌ను ఇంటికి పంపాలి : సీపీఐ రామకృష్ణ

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించాలి.. ఏపీలో జగన్‌ను ఇంటికి పంపాలి ఇవే మా లక్ష్యాలు అంటూ ఏపీ సీపీఐ నేత రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.

cpi ramakrishna

CPI State Secretary Ramakrishna : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగకముందే సీఎం జగన్ ఓటమిని అంగీకరిస్తున్నారని..ఓటమి భయంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారు అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. దేశ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని వ్యాఖ్యానించిన రామకృష్ణ జగన్ ఎమ్మెల్యేలను మార్చటంపై కౌంటర్ ఇచ్చారు. 82 మంది సీటింగ్ ఎమ్మెల్యేలను మారుస్తుతున్నారని..జగన్‌కు ఆ 82 మంది ఎమ్మెల్యేలపై ఎందుకంత అసంతృప్తి వచ్చిందో చెప్పాలన్నారు. జగన్ అధికారం అంతా తన వద్దే ఉంచుకుని సర్పంచ్ నుంచి మంత్రుల వరకు అందరినీ నిర్వీర్యం చేశారంటూ మండిపడ్డారు. ‘‘కేంద్రంలో నరేంద్ర మోదీని గద్దె దించాలి..రాష్ట్రంలో జగన్‌ను ఇంటికి పంపించాలి’’ ఇదే మా ప్రధాన ఉద్దేశ్యమన్నారు. వీటి కోసం ఏ పార్టీ ముందుకు వచ్చిన కలుపుకొని వెళ్తామని అన్నారు.16,17 తేదీలలో సీపీఐ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం భువనేశ్వర్‌లో జరగనుందని ఈ సమావేశంలో పొత్తులు పై చర్చిస్తామని తెలిపారు.

ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు..ఎందుకు..? అందరు డమ్మిలే.. అంటూ ఎద్దేవా చేశారు.గుండ్లకమ్మ ప్రాజెక్టులో గేటు కొట్టుపోతే మరమ్మతులు చేయలేని అసమర్ధ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. అంటూ విరుచుకుపడ్డారు.రుషికొండను బోడిగుండు కొట్టించిన ఘనత జగన్‌దేనని మండిపడ్డారు. రుషికొండపై రూ.450 కోట్లతో ప్యాలెస్ నిర్మించిన జగన్ అంగన్వాడి వర్కర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశారంటూ విమర్శించారు.మిగ్‌జాగ్ తుపానుతో రైతులంతా పంటలు నష్టపోతే జగన్ స్టేజ్ పైనుంచి పరిశీలించడం దారుణమన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమన్నారు.

Shankar Naik : నా జోలికి వస్తే నా సత్తా ఏంటో చూపిస్తా : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్యేలకు ఎటువంటి అధికారాలు లేకుండా అన్ని అధికారాలు తన వద్దే పెట్టుకున్నారని..అయినా ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రశ్నించరని.. ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యేలు గొంతువిప్పాలని సూచించారు. తెలంగాణలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తు పాలన చేస్తే..ప్రజలు ఓడించి ఇంటికి పంపించారని..జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కంటే పెద్ద నియంత అని అన్నారు.175 మంది ఎమ్మెల్యేలను మార్చిన సీఎం జగన్ గెలిచే పరిస్థితేలేదన్నారు.

మంత్రి సిదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులతో జగన్‌ను కలవడానికి వెళ్తే కలవనీయకుండా వెనక్కి పంపించారని..ఇప్పటికైనా అప్పలరాజు సిగ్గుపడాలి అంటూ ఎద్దేవా చేశారు. న్యాయస్థానాలంటే లెక్కలేని సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు అంటూ విమర్శించారు. చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను మోసం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.అమరావతి రాజధాని కాదు విశాఖే రాజధాని అని జగన్ కచ్చితంగా చెప్పగలరా…? అంటూ ప్రశ్నించారు.మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల ప్రజలను జగన్ మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

ఉత్తరాంధ్రా అభివృద్ధి కోసం కాదు..విశాఖ దోచుకోవడానికే రాజధానిగా ప్రకటించారని..మరోసారి ప్రజల్ని మోసం చేసి ఓట్లు దండుకోవటానికి మరో యత్నం చేస్తున్నారని ఇదంతా డ్రామా అంటూ మండిపడ్డారు. రుషికొండ నిర్మాణాలలో 150 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు.రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా రుషికొండ నిర్మాణాలపై విచారణ జరిపిస్తుందన్నారు.