AP Day Curfew : ఏపీలో డే కర్ఫ్యూకు కౌంట్ డౌన్ మొదలైంది..

ఏపీలో ఇవాళ్టి నుంచి డే కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయి. డే కర్ఫ్యూకు సంబంధించి ఆంక్షలు కఠినంగా అమలు చేయనున్నారు.

Andhra Pradesh Day Curfew : ఏపీలో ఇవాళ్టి నుంచి డే కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయి. డే కర్ఫ్యూకు సంబంధించి ఆంక్షలు కఠినంగా అమలు చేయనున్నారు.

పాక్షిక లాక్‌డౌన్‌లో భాగంగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ సమయంలో ఏపీలో 144వ సెక్షన్ అమలులో ఉంటుంది. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదు. రెండు వారాల పాటు ఈ ఆంక్షలు విధించినట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది.

రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంది. ఇవాళ్టి నుంచి 16 గంటలు కఠిన ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. పాక్షిక లాక్‌డౌన్ విధించడంతో కరోనా బాధితుల వైద్య సేవల కోసం అవసరమైన ఆక్సిజన్‌ స్టోరేజీకి అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ సూచించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజా రవాణాతో పాటు, ప్రైవేటు వాహనాలు తిరగడానికి వీల్లేదని మంత్రి పేర్ని నాని తెలిపారు.

మధ్యాహ్నం 12 గంటల తర్వాత అంతర్రాష్ట్ర, దూర ప్రాంత బస్సులు పూర్తి నిలిపివేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మరోవైపు మద్యం అమ్మకాల వేళలు కుదించారు. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే మద్యం దుకాణాలు ఉంటాయని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉత్తర్వులు జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు