EAPCET- 2025 Counselling
Eapcet 2025 Counselling: ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికిగాను ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకోసం ఈఏపీసెట్ -2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జులై 4వ తేదీన పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదలకానుంది. జులై 7వ తేదీ నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని సెట్ కన్వీనర్ గణేశ్ కుమార్ గురువారం వెల్లడించారు.
EAPCET కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా..
♦ నోటిఫికేషన్ విడుదల : జులై 4వ తేదీ
♦ ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్ : జులై 7 నుంచి జులై 16 వరకు.
♦ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ :జులై 17
♦ వెబ్ ఆప్షన్ల ఎంపిక : జులై 10 నుంచి 18వరకు.
♦ వెబ్ ఆప్షన్ల మార్పు : జులై 19
♦ సీట్ల కేటాయింపు : జులై 22
♦ కాలేజీల్లో రిపోర్టింగ్ : జులై 23 నుంచి 26 వరకు.
♦ తరగతులు ప్రారంభం : ఆగస్టు 4వ తేదీ నుంచి..
విద్యార్థుల వద్ద ఉండాల్సిన పత్రాలు..
♦ ఏపీ ఈఏపీసెట్ ర్యాంకు కార్డు.
♦ ఏపీ ఈఏపీసెట్ హాల్ టికెట్
♦ పదో తరగతి, ఇంటర్ మెమోలు
♦ ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు.
♦ టీసీ
♦ ఆదాయ ధ్రువీకరణ పత్రం
♦ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
♦ లోకల్ క్యాండెట్ సర్టిఫికెట్
♦ రెసిడెన్స్ సర్టిఫికెట్
సందేహాలుంటే 7995681678, 7995865456, 9177927677 హెల్స్‌డెస్క్ నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.
ఈసారి అగ్నికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ కు 81,837 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 75,460 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 67,761 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 89.8శాతం మంది క్వాలిఫై అయ్యారు. ఇంజనీరింగ్ స్టీమ్ లో.. 2,80,611 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,64,840 మంది పరీక్షలు రాయగా.. 1,89,748 మంది (71.65శాతం) విద్యార్థులు అర్హత సాధించారు.