అమ్మవారి మెడలో మంగళసూత్రం దొంగిలించిన ఘనుడు.. వీడియో వైరల్

ఓ వ్యక్తి సౌభాగ్యలక్ష్మీ ఆలయంలోకి అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లాడు. ముఖానికి మాస్క్ ధరించి ఉన్నాడు.

Man Thief in Temple

Thief in Temple : ఆలయంలో హుండీ డబ్బులు దొంగిలించిన దొంగను చూశాం.. కానీ, ఓ ఘనుడు ఏకంగా అమ్మవారి మెడలో మంగళ సూత్రంను కొట్టేశాడు. ఈ ఘటన ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. అయితే, దొంగ తెలివిగా ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్ ధరించాడు. ఈ దొంగతనం ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు సత్రంపాడులోని సౌభాగ్యలక్ష్మీ ఆలయంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : Crime News: ప్రసిద్ధ పుణ్యక్షేత్ర సమీపంలో 12 ఏళ్ల బాలికను ఘోరాతి ఘోరంగా..

ఓ వ్యక్తి సౌభాగ్యలక్ష్మీ ఆలయంలోకి అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లాడు. ముఖానికి మాస్క్ ధరించి ఉన్నాడు. తొలుత అమ్మవారిని దర్శించుకొని వెనక్కు మళ్లాడు. కొద్దిసేపు చుట్టుపక్కల చూశాడు. ఎవరూ రావడం లేదని గుర్తించాడు. అమ్మవారి విగ్రహం వద్దకు వెళ్లి దేవత మెడలోని మంగళసూత్రాన్ని దొంగిలించాడు. సదరు వ్యక్తి ఆలయంలోకి వెళ్లిన దగ్గర నుంచి అమ్మవారి మెడలో మంగళసూత్రం దొంగిలించి తీసుకెళ్లే వరకు సీసీ కెమెరాలో దృశ్యాలు నమోదయ్యాయి. కొద్దిసేపటి తరువాత అమ్మవారి మెడలో మంగళసూత్రం కనిపించక పోవటంతో ఆందోళన చెందిన నిర్వాహకులు విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు.

Also Read : ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి అనంతలోకాలకు.. ఈ ఏడాదిలోనే 10 మంది..

త్రీటౌన్ సీఐ వెంకటేశ్వరరావు, సిబ్బంది ఆలయం వద్దకు చేరుకొని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి అమ్మవారి మెడలో మంగళసూత్రాలను దొంగిలించినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు.