×
Ad

సొంత ఇల్లు లేదా? గుడ్‌న్యూస్‌.. ఈ పథకం దరఖాస్తు గడువును పొడిగించిన ప్రభుత్వం

స్థలంలేని వారికి 3 సెంట్ల భూమితో పాటు ఆర్థిక సాయం అందిస్తుంది.

PM Awas Yojana: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ), ఎన్‌టీఆర్ పథకానికి అప్లై చేసుకోవడానికి ఉన్న గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్‌ 30 చివరి తేదీ కాగా, చాలా మంది అప్లై చేసుకోలేకపోయారు.

దీంతో దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈ నెల 14 వరకు పొడిగించింది. గ్రామ/వార్డు సచివాలయాల్లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత ఇల్లులేని కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.2.50 లక్షల వరకు సాయం అందిస్తుంది. (PM Awas Yojana)

Also Read: తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు అప్పటినుంచే? ఈ సారి విద్యార్థుల ఆందోళన తగ్గించేలా ఇలా..

అలాగే, స్థలంలేని వారికి 3 సెంట్ల భూమితో పాటు ఆర్థిక సాయం అందిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 15.59 లక్షల ఇళ్లను నిర్మించాలని కూటమి సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.

ఇప్పటివరకు 3 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. నాలుగేళ్లలో మిగతా ఇళ్లు పూర్తి చేస్తామని ఇటీవల మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. అర్హులైనవారు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఫాంను పూర్తి చేయాలి. pmayg.nic.in వెబ్‌సైట్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు.