Andhra Pradesh Fire: ఏపీలో అగ్ని ప్రమాదం.. 36 ఈ-బైకులు దగ్ధం

ఆంధ్రప్రదేశ్, పార్వతిపురం జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదంలో దీపావళి స్పెషల్ సేల్ కోసం సిద్ధంగా ఉంచిన ఈ-బైకులు అగ్నికి ఆహుతయ్యాయి. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

Andhra Pradesh Fire: ఏపీలో అగ్ని ప్రమాదం.. 36 ఈ-బైకులు దగ్ధం

Updated On : October 24, 2022 / 1:08 PM IST

Andhra Pradesh Fire: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 36 ఈ-బైకులు దగ్ధమయ్యాయి. ఈ ఘటన పార్వతిపురం జిల్లా, పాలకొండ పట్టణంలో సోమవారం ఉదయం జరిగింది. స్థానికంగా మనం మోటార్స్ అనే ఒక ఈ-బైక్స్ షో రూమ్ ఉంది.

Mumbai: చూసినందుకే హత్య.. తనను చూస్తున్నాడని యువకుడిపై ముగ్గురు దాడి.. తీవ్ర గాయాలతో బాధితుడి మృతి

ఇందులో దీపావళి స్పెషల్ సేల్ సందర్భంగా విక్రయించేందుకు దాదాపు 36 ఈ-బైకులు, బ్యాటరీలు వంటివి సిద్ధం చేసి ఉంచారు. అయితే, సోమవారం వేకువఝామున షో రూమ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడి బైకులు, బ్యాటరీలు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను ఆర్పేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు భావిస్తున్నారు.

దీనికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో దగ్ధమైన మొత్తం బైకులు, ఇతర ఆస్తి విలువ దాదాపు రూ.50 లక్షలు ఉంటుందని షో రూమ్ నిర్వాహకులు తెలిపారు.