Andhra Pradesh : YCP నాయకుడు హత్య..పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తుల దాడి

జి. కొత్తపల్లి వైసీపీ గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్ దారుణ హత్యకు గురి అయ్యారు. గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తులు  దాడి చేశారు.

Ysrcp Mla Talari Venkatrao Attacked By Kottapalli Villagers (1)

ysrcp mla Talari Venkatrao attacked by kottapalli villagers : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రస్తుత ఏలూరు జిల్లాలోని ద్వారక తిరుమల మండలం జి కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జి. కొత్తపల్లి వైసీపీ గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్ దారుణ హత్యకు గురి అయ్యారు. దీంతో గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై కొత్తపల్లి వెళ్లారు. ఈ క్రమంలో  గ్రామస్తులు ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడి చేశారు. దీంతో ఎమ్మెల్యే పోలీసులు భద్రత నడుమ గ్రామ వదిలి వెళ్లిపోయారు.ఈ దాడిలో ఎమ్మెల్యేకు గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేతో పాటు ఆయన సెక్యూటి సిబ్బందిపై కూడా గ్రామస్తులు దాడి చేశారు.

గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడి చేసినవారు వారి సొంత పార్టీ కార్యకర్తలేనని తెలుస్తోంది. జి కొత్తపల్లి‌ వైసీపీలో రెండు వర్గాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే శనివారం (ఏప్రిల్ 30,2022) ఉదయం వైసీపీ నాయకుడు గంజి ప్రసాద్ దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే వెంకట్రావు జి కొత్తపల్లికి వెళ్లారు. అయితే ఎమ్మెల్యేను అక్కడున్న వైసీపీలోని ప్రసాద్ వర్గం అడ్డుకుంది.

ఎమ్మెల్యే మద్దతు ఓ వర్గానికి ఉండటం వల్లే హత్య జరిగిందంటూ ప్రసాద్ వర్గీయులు ఎమ్మెల్యేపై దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేపై దాడి జరగటంతో పోలీసులు ఎమ్మెల్యేకు రక్షణ నిలిచారు. ఎమ్మెల్యేను అక్కడి నుంచి ఊరి చివరకు తరలించటంతో ఎమ్మెల్యే అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేకు గాయాలు అయ్యాయి. గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. గంజి ప్రసాద్ వ్యతిరేక వర్గాన్ని ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని.. ఆ వర్గమే ప్రసాద్‌ను హత్య చేయించిందనే ఆరోపణలు వస్తున్నాయి.

మరోపక్క గ్రామంలో ఉన్న ఓ షాపు విషయంలో జరిగిన గొడవకాస్తా ఈ హత్యకు దారి తీసినట్లుగా కొంతమంది చెబుతున్నారు. తమ షాపును తొలగించటమేకాకుండా షాపుకు సంబంధించిన వ్యక్తుల్ని గ్రామం నుంచి వెళ్లిపోమని ఆదేశించారని..దీంతో అవమానంగా భావించిన బాధితులు కక్ష పెంచుకుని గంజి ప్రసాద్ ను కత్తులతో నరికి హత్య చేసారని సమాచారం. గంజి ప్రసాద్ ను హత్య చేసినవారు పోలీసులకు లొంగిపోయినట్లుగాను వారిని పోలీసులు జంగారెడ్డి గూడెం పోలీస్ స్టేషన్ కు తరలించినట్లుగా తెలుస్తోంది.

 

 




											




                                    

ట్రెండింగ్ వార్తలు