Registration Service Centers: ఏపీలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు.. అసలు వీటి పనేంటి? ఎందుకు గొడవ చేస్తున్నారు? సీఎం చంద్రబాబు స్పష్టత

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్తగా 'రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల(Registration Service Centers)' ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

Andhra Pradesh government is set to establish Registration Service Centers

  • రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ప్రారంభం
  • రూ. 2000లోనే సేవలు లభ్యం
  • సీఎం చంద్రబాబు కీలక హామీ

Registration Service Centers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీని తగ్గించి, సామాన్య ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు సరికొత్తగా ‘రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల(Registration Service Centers)’ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. నాణ్యమైన సేవలను అందుబాటులోకి తేవడంతో పాటు ప్రజలపై పడే అదనపు ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు నెలల క్రితమే ఈ విషయంపై అధికారిక ప్రకటన చేశారు. అయితే, ఈ కొత్త కేంద్రాల రాకతో తమ ఉపాధి ఎక్కడ కోల్పోతామోనని కొందరు రిజిస్ట్రేషన్ ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లు అసంతృప్తి వ్యక్తం చేయడంతో రాష్ట్రంలో ఒక చిన్నపాటి చర్చ, వివాదం నెలకొంది.

JP Nadda–CJP Leaders: నడ్డాతో సీజేపీ భేటీ సక్సెస్.. సీజేపీ ప్రధాన డిమాండ్లు ఇవే.. ప్రభుత్వం తదుపరి స్టెప్ ఏంటి?

అడుగడుగునా ఆదా రూ. 2,000 లోపే రిజిస్ట్రేషన్ సేవలు:

సాధారణంగా ఆస్తి లేదా వివిధ రకాల పత్రాల రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు బయట ఏజెంట్లకు, ఇతర మధ్యవర్తులకు రూ. 10,000 నుండి రూ. 20,000 వరకు సమర్పించుకోవాల్సి వస్తోంది. కానీ, ప్రభుత్వం ప్రారంభించనున్న ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లో కేవలం రూ. 2,000 లోపే ప్రజలు తమ పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవచ్చు. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా డాక్యుమెంట్ ప్రాసెసింగ్, ఆన్‌లైన్ చలానా చెల్లింపులు, స్లాట్ బుకింగ్, డాక్యుమెంట్ రైటింగ్ వంటి సేవలను అత్యంత పారదర్శకంగా అందించడమే ఈ కేంద్రాల ముఖ్యమైన పని. దీనివల్ల కాలయాపన తగ్గడమే కాకుండా సామాన్యుడి జేబుకు పెద్ద ఊరట లభించనుంది.

ఉపాధికి ఢోకా లేదు, సీఎం చంద్రబాబు నాయుడు కీలక హామీ:

తమ పొట్ట కొట్టడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటూ ఆవేదన చెందుతున్న ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్ల భయాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు. ఈ సేవా కేంద్రాల వల్ల ప్రస్తుతం ఉన్న ఏజెంట్లకు లేదా డాక్యుమెంట్ రైటర్లకు ఎలాంటి నష్టం జరగదని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సేవా కేంద్రాలు కేవలం ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం మాత్రమేనని, బయట ఉన్నవారు ఎవరి పనులు వారు యథావిధిగా చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ఒకవైపు ప్రజలకు తక్కువ ఖర్చుతో పారదర్శక సేవలు అందుతుండగా, మరోవైపు ఏజెంట్ల భయాలను సైతం ప్రభుత్వం పటాపంచలు చేసింది.