Teachers Transfers (Photo : Google)
Teachers Transfers Guidelines : ఏపీలో టీచర్ల బదిలీలకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒకే చోట ఐదేళ్లు పని చేసిన హెచ్‌ఎంలకు(హెడ్ మాస్టర్లు), ఎనిమిదేళ్లు పని చేసిన టీచర్లకు బదిలీ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరిస్తారు. కౌన్సెలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ నిర్వహిస్తారు. వేసవి సెలవులు పూర్తయ్యేలోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ నిర్ణయించింది.
ఇక, టీచర్ బదిలీల జి.ఓ లో కొత్త అంశం ఉంది. GO 47లో ప్రిఫరెంటియల్ కేటగిరీగా చెప్పబడిన 11 రకాల కేటగిరీలో లేని వాళ్ళు కూడా మెడికల్ గ్రౌండ్స్ పై అప్లయ్ చేసుకునే అవకాశం ఇచ్చింది. జిల్లా కమిటీ వాటిని పరిశీలించి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వారిని ప్రిఫరెంటియల్ కేటగిరీలో చేర్చే అవకాశం కల్పించింది.
Also Read..Karumuri Nageswara Rao : ఏ క్షణమైనా చంద్రబాబు అరెస్ట్- మంత్రి సంచలన వ్యాఖ్యలు
బదిలీలపై గత వారం ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కొత్త జిల్లాలు యూనిట్ గా టీచర్ల బదిలీల ప్రక్రియ జరగనుంది. మే 31వ తేదీలోగా ఖాళీ అవుతున్న ఉపాధ్యాయ పోస్టులతోనే బదిలీలు చేపట్టనున్నారు. టీచర్ల ట్రాన్సఫర్ల కోసం ప్రభుత్వం జీవో 47 రిలీజ్ చేసింది. ఇటీవలే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీచర్ల సంఘాలతో సమావేశం అయ్యారు. బదిలీలపై చర్చించారు. ఈ నెల 22 నుండి 31వ తేదీ వరకు బదిలీలకు అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. 2023 ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఒకే చోట ఐదేళ్లు సర్వీస్ పూర్తైన వారికి ట్రాన్సఫర్ మస్ట్ చేసింది సర్కార్. 2023 ఏప్రిల్ 30 నాటికి ఒకే చోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి రిక్వెస్ట్ పై బదిలీకి అవకాశం ఉంటుంది. ఉద్యోగుల అభ్యర్థన, పరిపాలన ప్రాతిపదికనే బదిలీలు ఉంటాయని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
* బదిలీల్లో భార్యాభర్తలకు ప్రాధాన్యత.
* ఒకసారి అవకాశం వినియోగించుకుంటే మళ్లీ ఐదేళ్ల తర్వాతే బదిలీలకు అర్హులు అవుతారు.
* బదిలీలు అన్నింటినీ ఉద్యోగుల అభ్యర్థనగానే పరిగణిస్తారు.
* ప్రమోషన్ పై ఉద్యోగి బదిలీ తప్పకపోతే బదిలీ చేసే చోట ఆ పోస్టు ఉండాలి.
* ఎలాంటి ఫిర్యాదులు, ఆరోపణలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా బదిలీలు జరిగే బాధ్యతను సంబంధిత శాఖల అధిపతులకు ఉంటుదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.